CM Chandrababu (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

CM Chandrababu: విశాఖకు గూగుల్ వచ్చేస్తోంది.. వచ్చే నెలలోనే ముహోర్తం.. సీఎం చంద్రబాబు ప్రకటన

CM Chandrababu: త్వరలోనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని సీఎం చంద్రబాబు స్ఫష్టం చేశారు. విశాఖపట్నంలో సీఐఐ- గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ సమావేశానికి సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ జీఎస్టీ స్లాబ్ లను తగ్గిస్తూ కేంద్రం తీసుకువచ్చిన సంస్కరణలు ఓ గేమ్ చేంజర్ గా మారబోతున్నాయని అన్నారు. సరైన సమయంలో సరైన చోట సరైన నేతగా ప్రధాని మోదీ ఉన్నారని కొనియాడారు. దేశానికి ఆయనో పెద్ద ఆస్తి అంటూ ఆకాశానికెత్తారు.

‘2047 నాటికి ఏపీ లక్ష్యం అదే’
ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ బలమైన ఆర్ధిక వ్యవస్థగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘2028 నాటికి మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని ఇబ్బందులు రాష్ట్రానికి వారసత్వంగా వచ్చాయి. గతంలో సృష్టించిన ఎకో సిస్టం కారణంగా అత్యధిక ఆదాయం గడిస్తోంది. ఏపీలోనూ సుదీర్ఘ తీరప్రాంతం, పోర్ట్ లెడ్ ఎకానమీ ద్వారా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తాం. వచ్చే నెలలోనే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

‘గత పాలనలో ఏపీ అవకాశాలు కోల్పోయింది’
వచ్చే ఏడాది ఆగస్టు నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని సీఎం చంద్రబాబు స్ఫష్టం చేశారు. ‘ప్రస్తుతం ఏపీలో లాజిస్టిక్స్ రంగంపై ప్రధానంగా దృష్టి సారించాం. 2019-24 మధ్య రాజకీయ పాలనా కారణాల వల్ల ఏపీ చాలా అవకాశాలను కోల్పోయింది. పీపీపీ విధానంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడపతో పాటు ఓర్వకల్లు, పుట్టపర్తి లాంటి చోట్ల కూడా విమాశ్రాయాలు ఉన్నాయి. అమరావతిలోనూ ఓ మంచి విమానాశ్రయం నిర్మించాలని ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రంలో మంచి రహదారులు ఉన్నాయి. రైల్వే కనెక్టివిటి పరంగా ఉత్తర దక్షిణాదిలను కలిపే ప్రాంతం ఏపీలోనే ఉంది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఏపీకి బుల్లెట్ ట్రైన్: సీఎం
హైదరాబాద్, బెంగుళూరు-అమరావతి, చెన్నై లను అనుసంధానిస్తూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా వస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘టెక్నాలజీ పరంగా దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ – స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మాతో ఎవరూ పోటీ పడలేరు. అమరావతి నగర నిర్మాణానికి రూ.15 వేల కోట్ల ఆర్ధిక సహకారాన్ని అందించిన ఆర్ధిక మంత్రికి ధన్యవాదాలు. గ్రీన్ ఫీల్డ్ నగరంగా అమరావతి నిర్మాణం చేస్తున్నాం. గుంటూరు, విజయవాడలను దీనికి అనుసంధానిస్తున్నాం. సంజీవని అనే కార్యక్రమం ద్వారా బిల్ గేట్స్ ఫౌండేషన్ తో డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేస్తున్నాం. డేటా లేక్ ద్వారా ప్రభుత్వ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేశాం. వాట్సప్ గవర్నెన్సు ద్వారా 700 పౌరసేవల్ని ప్రభుత్వం అందిస్తోంది. ప్రైవేటు కంపెనీల తరహాలో ప్రభుత్వం అందించే పౌర సేవలకు రేటింగ్ కూడా కోరుతున్నాం’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Also Read: Pakistan Gym: పాక్ జిమ్‌లో దిక్కుమాలిన కసరత్తులు.. నవ్వి నవ్వి పోతే.. ఎవరు రెస్పాన్సిబిలిటీ!

‘ప్రతీ ఒక్కరూ పెట్టుబడి పెట్టాలి’
ప్రతీ పారిశ్రామికవేత్త ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలని జీసీసీ వేదికగా సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘నాలెడ్జి ఎకానమీ ద్వారా సేవలు అందించే గ్లోబల్ హబ్ గా భారత్ మారుతుంది. రాష్ట్రంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. పరిశ్రమలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రభుత్వం మాది. అంతా కలిసి సంపద సృష్టిస్తేనే దేశం నుంచి రాష్ట్రం నుంచి పేదరికాన్ని నిర్మూలించగలం. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తాం. ఏపీలో ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వం అధికారంలో ఉంది. వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రప్రెన్యూర్ అనే నినాదంతో పనిచేస్తున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఔత్సాహికులకు చేయూత అందిస్తాం’ అని చంద్రబాబు వివరించారు.

Also Read: Viral News: సినిమా పిచ్చోళ్లు అంటే వీళ్లేనేమో.. టికెట్ల కోసం 7 ఏళ్ల బిడ్డను వదిలేశారు!

Just In

01

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?