brinjal
Viral

Brinjal: వంకాయ తొడిమ చెప్పే ఈ నిజం గురించి తెలుసా?

Brinjal: మనలో చాలా మంది వంకాయ పేరు వినగానే వామ్మో ఈ కూర మేము తినలేము మాకు ఇష్టం ఉండదు అంటారు. ఇంకొందరైతే అబ్బా అనుకుంటేనే తినేస్తారు. దీనిలో అన్నింటి కంటే.. వంకాయ కారం ఇష్టంగా తింటారు. సాధారణంగా చాలామంది వంకాయ చేసే కూర తినేందుకు మక్కువ చూపించరు. అయితే, ఈ కర్రీని మంచిగా వండితే అద్భుతంగ ఉంటుంది. వంకాయ కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఎన్నో పోషకాలు వంకాయలో ఉంటాయి. ఫైబర్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే ఈ కూరగాయ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మలబద్ధకాన్ని నివారించడం, బరువును నియంత్రించడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, మార్కెట్‌లో తాజా, పుచ్చులు లేని, చేదు విత్తనాలు లేని వంకాయను ఎంచుకోవడం చాలా కష్టం. అయితే, వంకాయ తొడిమను చూసి అది మంచిదో? కాదో ఈజీగా చెప్పొచ్చు.

తాజాదనం గుర్తు

వంకాయ నునుపుగా, నిగనిగలాడుతూ, గట్టిగా ఉంటే అది తాజా కాయ అని అర్థం. ముడతలు, మచ్చలు, చిన్న రంధ్రాలు లేదా పసుపు/గోధుమ రంగు గుర్తులు కనిపిస్తే, లోపల సమస్య ఉండవచ్చు. అలాంటి కాయలను ఎంచుకోకూడదు.

తొడిమ చెప్పిన సత్యం

వంకాయ కాడ (తొడిమ) పచ్చగా, తాజాగా ఉంటే, ఆ కాయ చెట్టు నుంచి కోయబడిందని అర్థం. కాడ ఎండిపోయి, గోధుమ రంగులోకి మారినట్లయితే, అది రెండు రోజులది అని తెలుసుకోవాలి.

నొక్కితే తెలుస్తుంది

వంకాయను వేలితో సున్నితంగా నొక్కండి. నొక్కిన చోట వెంటనే సాధారణ స్థితికి వస్తే, అది దృఢమైన, తాజా కాయ. ఒకవేళ నొక్కిన గుర్తు అలాగే ఉండి, గుంటలా మారితే, అది పాడైపోయినదని లేదా పురుగులు చేరినదని సంకేతం.

బరువును పరిశీలించండి

పెద్ద పరిమాణంలో ఉండి, చేతిలో తేలికగా అనిపించే వంకాయలు లోపల పుచ్చులతో లేదా బోలుగా ఉండవచ్చు. కాబట్టి, పరిమాణానికి తగిన బరువు, కాస్త చిన్నగా, గట్టిగా ఉన్న కాయలను ఎంచుకోండి.

విత్తనాలు

మధ్యస్థ పరిమాణంలో, గుండ్రని వంకాయలలో విత్తనాలు తక్కువగా ఉంటాయి. పొడవైన లేదా చాలా పెద్ద కాయలలో గింజలు, పీచు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!