Ponnam Prabhakar: బడుగు బలహీన వర్గాల్లో కుల వృత్తుల ఆధారపడే కులాలు మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆర్థిక వృద్ధి సాధించేలా కుల వృత్తులు ఎదగాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆకాంక్షించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో షాద్ నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్(MLA Irlapalli Shankar) ఆధ్వర్యంలో రజక వృత్తిదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రజక వృత్తిదారుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
యాక్షన్ ప్లాన్ సిద్ధం
నాయూ బ్రాహ్మణ సెలూన్ లు బ్యూటీపార్లర్ లుగా ,రజక దోభిఘాట్ లు అధునాతన డ్రైక్లినింగ్ లుగా మారినప్పుడే వృత్తికి సార్థకంగా మారుతుందని అప్పుడే వృత్తిదారులు ఆర్థికంగా ఎదుగుతారని తెలిపారు. హైదరాబాద్(Hyderabad) లో త్వరలోనే 9 మోడర్న్ డోబిఘాట్ లు రాబోతున్నాయని , రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 మోడర్న్ దోభిఘాట్(Modern Dobhi Ghat) లు ఏర్పాటు చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నగరంలో 12 ధోబిఘాట్ లకు ఏర్పడిన సమస్యలు మరమత్తులు చేసేలా కార్యచరణ తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కాలువలు, చెరువులు ఇతర ప్రాంతాల్లో వృత్తి కొనసాగుతుంది.
Also Read: Jogulamba Gadwal: భర్తపై వేడి నూనె పోసిన భార్య.. చికిత్స పొందుతూ మరణించిన భర్త వెంకటేష్
250 యూనిట్ల ఉచిత విద్యుత్
జిల్లాల్లో రజక వృత్తిదారులకు కేటాయించిన భూమిపై వస్తున్న ఇబ్బందులు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు ,కలెక్టర్ లు సమన్వయం చేసుకుని పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నాయీ బ్రాహ్మణ సెలూన్(Nai Brahmin Salon లకు, రజక వృత్తిదారులకు ఇస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నామని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయదేవి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన(Collector Dasari Harichandana,), ఆర్డీవో , బీసీ సంక్షేమ శాఖ అధికారులు,రజక వృత్తిదారుల సంఘం నేతలు పాల్గొన్నారు.
Also Read: JubileeHills Survey: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సర్వే.. ఆ సామాజికవర్గానిదే కీలక పాత్ర!