Band Melam ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Band Melam: ఈ సారి మాస్ టైటిల్ తో రెడీ అయిన కోర్ట్ మూవీ జంట

Band Melam: కోర్ట్ మూవీతో పెద్ద హిట్ కొట్టి వరుస అవకాశాలను అందిపుచ్చుకుని హీరో హర్ష రోషన్, హీరోయిన్ శ్రీదేవి ఫుల్ బిజీగా మారారు. అసలు ఎవరూ ఉహించని విధంగా చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకుంది. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రానికి కొత్త దర్శకుడు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించాడు. ఈ కోర్ట్‌రూమ్ డ్రామా, ఫోక్సో చట్టాన్ని నేపథ్యంగా చేసుకుని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించి, తమ సహజసిద్ధమైన నటనతో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. బలమైన కథకు తగ్గట్టుగా, ఈ ఇద్దరూ తమ పాత్రలను అద్భుతంగా పోషించి, ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.

Also Read: Fee Reimbursement: రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వం రైట్ డెసిషన్.. పేరెంట్స్ హర్షం.. ఏందుకొ తెలుసా..?

ఈ జోడీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలను మరోసారి నిజం చేసేందుకు, హర్ష రోషన్, శ్రీదేవి కొత్త చిత్రం ‘బ్యాండ్ మేళం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు సతీష్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. “రాజమ్మా!” అని యాదగిరి పిలిచే సన్నివేశంతో ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. బావ-మరదళ్ల మధ్య సరదా సంభాషణతో సాగే ఈ గ్లింప్స్‌లో, “నీ కోసం కొత్త ట్యూన్ చేశా” అని యాదగిరి చెప్పగా, “నాకోసమా? సరే, షురూ జెయ్!” అంటూ రాజమ్మ సమాధానం ఇస్తుంది.

Also Read: Aarogyasri Services: ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలి.. సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి

“నీవు వాయిస్తే బోనగిరి దాకా ఇనిపిస్తది చూడు!” అని యాదగిరి అంటాడు. పక్కా తెలంగాణ యాసలో సాగే ఈ సంభాషణ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఈ గ్లింప్స్‌కు విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం మరో హైలైట్. ‘కోర్ట్’ సినిమాకు తన సోల్‌ఫుల్ మ్యూజిక్‌తో మాయ చేసిన విజయ్ బుల్గానిన్, ‘బ్యాండ్ మేళం’తో మరోసారి తన ప్రతిభను చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ముగ్గురూ కలిసి మరోసారి అద్భుతం సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కోర్ట్’ విజయంతో ముందుకు వెళ్తున్న ఈ టీం ‘బ్యాండ్ మేళం’ మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతుంది.

Just In

01

Jayammu Nischayammu Raa: నాకు ఆ డ్యాన్స్‌లేవీ రావ్.. జగపతిబాబు షోలో ప్రభుదేవా!

Sai Pallavi: బికినీలో నేచురల్ బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్!

Telangana: జాతీయ రహదారులు ఎందుకు ఆలస్యమవుతున్నాయ్ ..?

Yedupayala Vana Durga: ఏడుపాయలలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?