RTI Awareness (imagecredit:swetcha)
తెలంగాణ

RTI Awareness: సమాచార హక్కు చట్టం పటిష్టంగా అమలు: కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి

RTI Awareness: సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) 2005 ను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి(Commissioner Dr. G. Chandrasekhar Reddy) అన్నారు. కలెక్టరేట్ లో సమాచార హక్కు చట్టం-2005 పై పిఐఓ లకు మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి, సమాచార హక్కు చట్టం కమిషనర్లు దేశాల భూపాల్, పీవీ శ్రీనివాస రావు, అయోధ్య రెడ్డి, మెహసిన పర్వీన్, జిల్లా కలెక్టర్ కె. హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ గరీమ అగ్రవాల్ లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లా(Siddipet District)లో సమాచార హక్కు చట్టం ద్వారా తక్కువ దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని, ఇదే విధంగా కృషి చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 17000 దరఖాస్తులను పరిష్కరించి జిరో గా చేయాలని జిల్లాలో పర్యటిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 1 లక్ష 50 వేల మంది రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడుగుతున్నారని తెలిపారు. దరఖాస్తు దారుడు కోరిన సమాచారాన్ని హార్డ్, సాఫ్ట్ కాపీ లేదా నేరుగా చూడడం ద్వారా పొందవచ్చని, తెల్ల రేషన్ కార్డ్ దారుడు ఉచితంగా సమాచారాన్ని పొందగలరని, ఇతరులు 10 రూపాయల కోర్ట్ ఫీ ద్వారా సమాచారాని చెల్లించి సంచారం పొందవచ్చు అని అన్నారు.

దరఖాస్తు దారుడు కోరిన సమాచారం

4(1 బి) ప్రకారం పౌర సేవలు ఏ సమయంలో అందించాలి, అధికారుల వివరాలను తెలిపే సైన్ బోర్డ్ లను ఏర్పాటు చేయాలని, జిల్లా సమాచారాన్ని చట్టం ద్వారా పొందే హక్కు కలిగి ఉందని, వెబ్ సైట్ లో చట్టానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం అందుబాటులో ఉంటుందని. 6(1) క్రింద దరఖాస్తు దారుడు కోరిన సమాచారం అందించాలని, ప్రతి కార్యాలయంలో పి ఐ ఓ, ఏ పి ఐ ఓ లు దరఖాస్తులు స్వీకరించి సమాచారం అందించాలని, పబ్లిక్ అడిగిన సంచారం అందించాలని, వైట్ రేషన్ కార్డు గ్రామ సమాచారం అందిగునప్పుడు సున్నా, మండల సమాచారం అడిగినప్పుడు 5 రూపాయలు చెల్లించ వచ్చని తెలిపారు.

ఆర్టిఐ చట్టం పై అధికారులందరికి సమగ్రమైన అవగాహన కల్పించి పటిష్టంగా అమలు జరగాలని లక్ష్యంగా ఆర్టిఐ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ప్రతి అధికారి తన హక్కులు , బాధ్యతలు చట్టపరంగా పాటించాల్సిన మార్గదర్శకాలను తెలుసుకొని సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఆర్టిఐ చట్టాన్ని నిజమైన స్పూర్తితో పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. పిఐఓ ఇచ్చిన సమాచారం సంతృప్తి చెందని పక్షంలో ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ సంప్రదించేలా అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం చట్టంపై పిఐఓ,ఏపిఐ లకు ఉన్న సందేహాలను న

 పెండింగ్‌లో 170 ఆర్.టి.ఐ ఆప్పీల్ కేసులు

జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు సమాచార హక్కు చట్టం 2005 చాలా దోహదం చేస్తుందని రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో పిఐఓ లకు ఆర్టిఐ చట్టంపై కల్పిస్తున్న ఈ అవగాహన కార్యక్రమం చాలా ముఖ్యమైనదని జిల్లాలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర సమాచార కమిషన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఆర్టిఐ చట్టం పై ప్రతి ఒక్క అధికారి పూర్తి అవగాహన పెంపొందించుకొని ఆర్టిఐ మార్గదర్శకాల ప్రకారం అధికారులు స్పందించి దరఖాస్తుదారుకు పారదర్శకంగా సమాచారాన్ని అందించాలని అన్నారు. ఈరోజు జిల్లాలో పెండింగ్ లో గల 170 ఆర్.టి.ఐ ఆప్పీల్ కేసులను కలెక్టరేట్ లో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ ప్రత్యేకంగా హియరింగ్ నిర్వహించి పరిష్కరించనున్నదని తెలిపారు. జిల్లాలో ఆర్టిఐ దరఖాస్తులు పెండింగ్లో లేకుండా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని తెలిపారు.

Also Read: Yennam Srinivas Reddy: ప్రైవేటు విద్యాసంస్థల్లో వెల్ఫేర్ ఫండ్ కీలకం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఆర్టిఐ కమిషన్ చర్యలు

సమాచార హక్కు చట్టం కమిషనర్ ఇవి శ్రీనివాస్, అయోధ్య రెడ్డి, మొహసీనా పర్వీన్, దేశాల భూపాల్ లు మాట్లాడుతూ ఆర్టిఐ చట్టం ప్రజల్లో తీసుకుని వెళ్ళెందుకు వారదులుగా ప్రభుత్వ అధికారులు సిబ్బంది పని చేయాలని అన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి సమాచారం అడిగే హక్కు కల్పించిన వజ్రాయుధం ఆర్టిఐ చట్టం అని అన్నారు. ప్రతి ప్రజా సమాచార అధికారి ఆర్.టి.ఐ. చట్టం పై సంపూర్ణ అవగాహన కల్గి ఉండాలని అన్నారు. 2005 లో భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టం మన దేశంలో వచ్చిందని అన్నారు. ప్రజా సమాచార అధికారి తప్పుడు సమాచారం అందించినా, ఆలస్యం చేసినా ఆర్టిఐ చట్టం సెక్షన్ 21,22 ప్రకారం ఆర్టిఐ కమిషన్ చర్యలు తీసుకోవచ్చని ఆయన తెలిపారు. ఆర్టిఐ చట్టం నిబంధనలు తెలుసుకొని ప్రతి అధికారి పాటించాలని అన్నారు. 2 సంవత్సరాల పైగా ఆర్టిఐ కమిషన్ లేని కారణంగా సుమారు 17000 పైగా కేసులు పెండింగ్ ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆర్టిఐ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తగు వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు.

వ్యక్తిగత సమాచారం మాత్రమే..

ఆర్టిఐ చట్టం అమలు లో నిర్లక్ష్యం వహిస్తే అనవసరపు అనుమానాలకు తావు ఉంటుందని అన్నారు. ఆర్టిఐ దరఖాస్తులను సకాలంలో డిస్పోస్ చేయడం ద్వారా ప్రజలలో ఉన్న అనుమానాలు తీరి పోతాయని అన్నారు. ప్రపంచంలో భారతదేశం సమాచార హక్కు చట్టం అమలులో 8వ స్థానంలో ఉందని అన్నారు. మన దగ్గర ఉన్న సమాచారాన్ని నిబంధనల ప్రకారం అందించాలని అన్నారు.మన అధికారులు అనవసరంగా భయాందోళనలకు గురై సమాచారాన్ని దాచి పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. సెక్షన్ 81(j) ప్రకారం వ్యక్తిగత సమాచారం మాత్రమే ఇవ్వవద్దని, దీనిని దుర్వినియోగం చేయవద్దని అన్నారు.

మన దేశంలో తెలంగాణ రాష్ట్రం సమాచార హక్కు చట్టం అమలులో మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజా సమాచార అధికారులకు ఆర్టిఐ చట్టం అమలులో ఉన్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. అనంతరం సమాచార హక్కు చట్టం సంబంధించి జిల్లా లో పెండింగ్ ఉన్న 170 కేసులను కమిషన్ సభ్యులు జిల్లా సమీకృత కార్యాలయ భవనంలో పరిశీలించి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, ఏసీపీలు, జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఫస్ట్ అప్పిలేట్ అధికారులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, పోలీస్ అధికారులు సంబంధిత అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also Read: Ram chander Naik: సత్యవతి రాథోడ్ ఇది మీకు తగునా?.. ఘాటుగా స్పందించిన డిప్యూటీ స్పీకర్

Just In

01

Huzurabad Hospital: హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు.. డాక్టర్ కృష్ణ ప్రసాద్ పిలుపు

Telangana: ప్రభాకర్ రావు సహకరించటం లేదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు

Kolkata Rainfall: గత 22 రోజుల వర్షపాతం 6 గంటల్లోనే.. కోల్‌కతా కకావికలం.. 9 మంది మృతి.. 30 విమానాలు రద్దు

Women Gestures: వాడికి ఏదో మందు పెట్టిందిరా ఆ అమ్మాయి అని చేసేలా.. గర్ల్స్ బాడీ లాంగ్వేజ్ వెనుక రహస్యం ఇదే!

Suryapet SP: పోలీసులపై దాడి జరిగిన ఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ నరసింహ