Kavitha ( IMAGE credit: twitter)
Politics, లేటెస్ట్ న్యూస్

Kavitha: కవితతో విష్ణువర్ధన్ రెడ్డి భేటీ.. జూబ్లీహిల్స్ అభ్యర్థి అతడేనా..?

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(Kavitha)తో మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy)  కలిశారు. పెద్దగుడిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అందుకు ఆహ్వాన పత్రికను కవితకు అందజేశారు. ఆ తర్వాత తాజా రాజకీయాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. అర్ధగంటకు పైగా రాజకీయాలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో వీరిద్దరిభేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి సైతం ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు పార్టీ టికెట్ ఖరారు చేసింది. దీంతో కవితతో భేటీ కావడం, ఇప్పటికే కవిత జూబ్లీహిల్స్ బరిలో జాగృతి నుంచి అభ్యర్థిని నిలిపేందుకు కసరత్తు చేస్తుంది. ఈ తరుణంలో విష్ణువర్ధన్ రెడ్డి ని పోటీలో నిలుపుతుందా? లేకుంటే మరో వ్యక్తిని ఎవరినైనా పొటీ చేయిస్తుందా? అనే చర్చ జోరుగా సాగుతుంది.

 Also Read: Kavitha: కవిత రాజీనామా పెండింగ్?.. ఆమోదం ఎప్పుడంటే?

విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మారుతున్నారా?

విష్ణువర్ధన్ రెడ్డి 2004లో జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లోనూ విజయం సాధించారు. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2014లో ఏర్పడిన జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో సైతం ఓటమిపాలయ్యారు. 2023లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లో ఆధరణ ఉంది. మాగంటి మృతితో వచ్చే ఉప ఎన్నికల్లో టికెట్ ను పార్టీ ఇవ్వకపోవడం, కవితతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మారుతున్నారా? అనే చర్చసైతం మొదలైంది.

కేటీఆర్ తోనే నా ప్రయాణం.. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోనే నా ప్రయాణం అని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. కవితతో భేటీ తర్వాత జరుగుతున్న ప్రచారాలను కొట్టిపారేశారు. పెద్దగుడిలో ప్రతి ఏటా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, ఆ ఉత్సవాలకు రావాలని కవితకు ఆహ్వాన పత్రికను అందజేశానన్నారు. అంతే తప్ప రాజకీయాలపై చర్చజరగలేదన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని స్పష్టం చేశారు. నేను అప్పుడు చెప్పినా.. ఇప్పుడు చెప్తున్నా కేటీఆర్ తోనే ఉంటానన్నారు. ఆయనకు ప్రమోషన్ ఉంటది.. నాకు ప్రమోషన్ ఉంటదని తెలిపారు.

 Also Read:Kavitha: కవిత వ్యూహాత్మక అడుగులు సస్పెన్షన్ తర్వాత గులాబీ పార్టీకి షాక్?

Just In

01

Bommala koluvu: దసరా పండుగ ప్రత్యేకం.. పల్లెల్లో బొమ్మల కొలువు సాంప్రదాయాలకు నెలవు

India vs Pakisthan: మెున్న హారీస్ రౌఫ్.. ఇప్పుడు పాక్ మహిళా క్రికెటర్.. నెట్టింట చెత్త పోస్ట్!

Huzurabad Hospital: హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు.. డాక్టర్ కృష్ణ ప్రసాద్ పిలుపు

Telangana: ప్రభాకర్ రావు సహకరించటం లేదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు

Kolkata Rainfall: గత 22 రోజుల వర్షపాతం 6 గంటల్లోనే.. కోల్‌కతా కకావికలం.. 9 మంది మృతి.. 30 విమానాలు రద్దు