New Sports Policy (imagecredit:twitter)
తెలంగాణ

New Sports Policy: క్రీడాకారులకు గుడ్ న్యూస్.. నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలు నిర్మాణం.. ఎప్పుడంటే..?

New Sports Policy: దశాబ్దాలుగా ప్రభుత్వాలు సరైన క్రీడా పాలసీ రూపొందించకపోవడం, క్రీడాకారులు, కోచ్ లకు సరైన ప్రోత్సాహం కల్పించకపోవడం, మౌలిక వసతులు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పథకాలను సాధించలేకపోతున్నామని, భావించి సమూలంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth R), ప్రజాప్రభుత్వం కంకణం కట్టుకుంది. దేశ క్రీడా రంగానికి దిక్సూచిగా, ఒలింపిక్స్ పతకాల వేటకు ఆట మైదానంగా భావి క్రీడాకారులకు మార్గర్శిగా ఘనమైన గత వారసత్వపు పరిమళాలను మరింత వ్యాపింపజేసేందుకు హైదరాబాద్ వేదికగా తీర్చిద్దేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రతి క్రీడాకారుడిలో ప్రతిభను మరింతగా సానబట్టి విశ్వ వేదికపై మన క్రీడాకారులు దేశపతాకాన్ని గర్వంగా ఎగురవేసేందుకు వీలుగా వారికి అవసమైన వసతులు, ప్రోత్సాహకాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం క్రీడాపాలసీని రూపొందించింది. ఆదిశగాప్రభుత్వం ముందుకు సాగుతుంది.

దేశంలో నూతన విధానం

‘చదువుల్లోనే కాదు క్రీడల్లో రాణిస్తే తప్పకుండా ప్రభుత్వం మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది.. మీకు అండగా నిలుస్తుంది. ఒక స్పష్టమైన క్రీడా విధానాన్ని స్పోర్ట్స్​ యూనివర్సిటీ(Sports University), స్పోర్ట్స్​ అకాడమీ(Sports Academies)లను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నా. దేశంలో నూతన విధానం ప్రవేశపెట్టాలి. దేశం అభివృద్ధి చెందాలి. ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న ఈ దేశం ఒక బలమైన క్రీడలకు వేదిక కావాలని మా ప్రభుత్వం ఆలోచన చేసింది. అందుకే మా విజన్​ డాక్యుమెంట్​లో స్పోర్ట్స్​ పాలసీని కూడా ఒక చాప్టర్​గా పెట్టాం’- ఈ ఏడాది ఆగస్టు 2న హెచ్​ఐసీసీ(HICC)లో తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ తొలి ఎడిషన్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి.

క్రీడా అభివృద్ధికి బడ్జెట్..

తెలంగాణలో క్రీడారంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడాపాలసీని ప్రకటిస్తామని చెప్పిన విధంగానే ఆవిష్కరించింది. గ్రామీణ స్థాయిలోని క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. 119 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణం, ప్రతి మండలంలో క్రీడా మైదానాలు ఏర్పాటు, అర్బన్ లోనూ మినీ స్టేడియంలను నిర్మించేందుకు సిద్ధమైంది. అందులో క్రీడాకారులకు కావల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించాలని భావించింది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం క్రీడా అభివృద్ధికి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించింది. 2024-2025, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో రూ.830కోట్లు కేటాయించింది. 2024- 2025 లో క్రీడారంగానికి రూ.365కోట్లు కేటాయించగా, 2025-26 బడ్జెట్ (మార్చి 2025లో)రూ.465 కోట్లు కేటాయించారు. క్రీడాకారుల్లో ప్రతిభలను పెంపొందించడం, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం, ఆలింపిక్‌లకు సిద్ధం చేయడం వంటి లక్ష్యాలతో పనులు సాగుతున్నాయి. క్రీడా అధికారులు, యూత్ అడ్వాన్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఈ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. ప్రధానంగా క్రీడాప్రాంగణాల్లో మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు

హకీంపేట్‌లో 200 ఎకరాల్లో..

స్పోర్ట్స్ పాలసీలో భాగంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి శ్రీకారం చుడుతుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు సాగుతుంది. తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ ఏర్పాటు, ప్రభుత్వ గ్రాంట్లు, సీఎస్ఆర్ నిధులు, ఎంపీ, ఎమ్మెల్యే నిధుల ద్వారా సేకరణ చేపడుతున్నారు. అన్ని క్రీడా సంఘాల సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ క్యాలెండర్ అమలు చేస్తున్నారు.ఫిజియోథెర‌పీ, ఇత‌ర క్రీడా సంబంధిత కోర్సులు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. స్టేడియాల్లో కోచ్‌లు, అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌కు త‌గిన‌ట్లు శిక్ష‌ణ ఇప్పించనున్నారు. హకీంపేట్‌లో 200 ఎకరాల్లో 2025లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, హబ్.వరల్డ్-క్లాస్ అథ్లెట్లు తయారు చేయడానికి దోహదపడనుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ యూనివర్సిటీలో క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్‌, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ లాంటి 14 క్రీడలను స్పోర్ట్స్ హబ్‌లో చేర్చనున్నారు.

Also Read; Mouli viral video: మౌళి అప్పుడు సరదాగా చేసింది ఇప్పుడు నిజమైంది.. అది ఏంటంటే?

రిటైర్డ్ క్రీడాకారులకు పింఛన్లు

ప్రభుత్వం రూపొందించిన నూతన క్రీడాపాలసీలో 5 ప్రధాన అంశాలు ఉన్నాయి. క్రీడా విధాన నిర్వహణ, క్రీడారంగంపై సానుకూల పెంచడం, క్రీడాభివృద్ధికి అవసరమైన దీర్ఘకాలిక విధానాల రూపకల్పన, క్రీడల అభివృద్ధికి అవసరమైన మైదానాలు-కోర్టుల అభివృద్ధి, క్రీడాకారుల నైపుణ్యాల పెంపునకు చర్యలు- ఉద్యోగ అవకాశాలు కల్పన. అంశాలను ప్రధానంగా చేర్చారు. క్రీడాకారులు, పారా క్రీడాకాలరుకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. అదే విధంగా ఒలింపిక్స్ గెలిచిన వారికి భారీ బహుమతులు, క్రీడాకారులకు రిజర్వేషన్లు, రిటైర్డ్ క్రీడాకారులకు పింఛన్లు, కోచ్ లకు మెరుగైన పారితోషికాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒలింపిక్స్/పారాలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించినవారికి రూ.6 కోట్లు, సిల్వర్ మెడల్ పొందిన వారికి రూ.4 కోట్లు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి రూ.2.5 కోట్లు, ఒలింపిక్స్ పార్టిసిపేషన్ చేసిన క్రీడాకారులకు రూ.15 లక్షలు ఇస్తామని సీఎం ప్రకటించారు. మరోవైపు కోచ్‌లకు గుర్తింపు, భద్రతకు పెద్దపీట వేస్తుంది. క్రీడాకారుల విజయాల్లో పాత్ర వహించిన కోచ్‌ల ప్రతిభకు గుర్తింపుతో పాటు భరోసా, ప్రోత్సాహం ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఎల్‌టీఏడీ( లాంగ్ టర్మ్ అథ్లెట

నేషనల్ కరాటే చాంపియాయన్‌షిప్

చీఫ్ మినిస్టర్స్ కప్ 2024 ద్వారా 33 జిల్లాల్లో గ్రామీణ ప్రతిభను గుర్తించారు. 2025 సమర్ క్యాంపులు 641 సెంటర్లలో నిర్వహించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో పేపర్‌లెస్ విధానాన్ని అమలు చేశారు. డిసెంబర్ 2024లో 57 ఏళ్ల తర్వాత సంతోష్ ట్రోఫీ ఫైనల్స్ హైదరాబాద్‌లో జరిగాయి. అలాగే, 4వ కేఐఓ నేషనల్ కరాటే చాంపియాయన్‌షిప్, ఒలింపిక్ డే రన్ వంటి ఈవెంట్లు యువ క్రీడాకారులకు వేదిక అయ్యాయి. అదే విధంగా మహమ్మద్ సిరాజ్ (T20 వరల్డ్ కప్), నిక్హత్ జారీన్ (వరల్డ్ బాక్సింగ్), దీప్తి జీవంజి (ప్యారాలింపిక్స్ మెడలిస్ట్) వంటి క్రీడాకారులకు నగదు బహుమతులు, గ్రూప్-2 ఉద్యోగాలు కల్పించారు. పాఠశాలల్లో తప్పనిసరి క్రీడా పీరియడ్, కొత్త క్రీడల పరిచయం (కురాష్, బాక్సింగ్) వంటి చర్యలు యువతలో క్రీడా ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ (టీఎస్డీఎఫ్) ద్వారా సీఎస్ఆర్, ఎంపీ/ఎమ్మెల్యే నిధులను సమీకరిస్తూ, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో క్రీడా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంచేస్తున్నారు. తెలంగాణను క్రీడా రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపే దిశగా పకడ్బందీగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.

గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు

క్రీడా ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. 2014-2023 మధ్య ఎస్ఏటీజీ(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ) ప్రాజెక్టుల్లో టెండర్‌లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. గచ్చిబౌలి స్టేడియం అప్‌గ్రేడ్, రాష్ట్రవ్యాప్త మినీ స్టేడియంల ప్రాజెక్టుల్లో డిలేలు, ఖర్చులు పెరగడం వల్ల రూ.50-100 కోట్లు దుర్వినియోగమైందని కాగ్ (కాంప్ట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ జనరల్) నివేదికలో పేర్కొన్నారు. స్పోర్ట్స్ శాఖలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఎక్స్ (ట్విట్టర్)లో “స్కామ్ జరిగింది” అనే వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) ఓటమికి క్రీడా నిర్లక్ష్యం, అక్రమాలు కీలక కారణాలు అని సీఎస్డీఎస్-లొక్‌నిటీ సర్వే లో వెల్లడైంది. 20% ఓటర్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని,అందులో క్రీడా రంగం కూడా ఉందని సర్వేలో స్పష్టమైంది.

Also Read: Jupally Krishna Rao: డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. అవసరమైతే ఆయుధాలు ఇస్తాం.. ప్రభుత్వం కీలక ప్రకటన

Just In

01

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?