Yoga Guru Honey Trap (imagecredit:twitter)
తెలంగాణ

Yoga Guru Honey Trap: హనీ ట్రాప్‌లో ఓ యోగా గురువు.. ఆయన ఎవరో తెలిస్తే మీరు షాక్..?

Yoga Guru Honey Trap: అప్పనంగా డబ్బు సంపాదించాలని ఓ గ్యాంగ్ ఓ యోగా గురువుకే హనీ ట్రాప్(Honey Trap) విసిరింది. 50లక్షల రూపాయలకు చెక్కులు తీసుకుని మరో 2కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు అయిదుగురు సభ్యుల గ్యాంగును అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

పథకం ప్రకారం కొంతకాలం

రంగారెడ్డి(Rangareddy) జిల్లా చేవెళ్లలో రంగారెడ్డి అనే వ్యక్తి యోగాశ్రమం నడుపుతున్నాడు. ఈ ఆశ్రమానికి పెద్ద సంఖ్యలో జనం వస్తుండటం.. విరాళాలు ఇస్తుండటాన్ని అమర్(Amar)​ అనే వ్యక్తి గమనించాడు. వలపు వలలోకి రంగారెడ్డిని లాగి డబ్బు కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం మౌలాలి, రాజేశ్, మంజుల, రజనీలను గ్యాంగులోకి చేర్చుకున్నాడు. ఇక, రూపొందించుకున్న పథకం ప్రకారం కొంతకాలం క్రితం మంజుల, రజనీలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి చికిత్స కోసం ఆశ్రమంలో చేరారు. ఇలా ఆశ్రమంలో చేరిన ఈ ఇద్దరు మొదట రంగారెడ్డితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. ఆ తరువాత అతనితో సన్నిహితంగా ఉన్నపుడు ఫోటో(Photose)లు, వీడియోలు(Videos) తీసి పెట్టుకున్నారు. అనంతరం రంగంలోకి దిగిన అమర్, మౌలాలి, రాజేశ్ లు ఈ ఫోటోలు, వీడియోలను రంగారెడ్డికి పంపించారు.

Also Read: Modi Manipur visit: జోరు వానలో హెలికాప్టర్ వద్దన్న భద్రతా సిబ్బంది.. మోదీ డేరింగ్ నిర్ణయం!

మరో 2కోట్ల రూపాయలు డిమాండ్

తాము చెప్పినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియా(Social Media)లో అప్ లోడ్ చేస్తామని భయపెట్టారు. అలా జరగకుండా ఉండాలంటే 50లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. దాంతో రంగారెడ్డి 50లక్షల రూపాయలకు చెక్కులు ఇచ్చాడు. బెదిరించిన వెంటనే రంగారెడ్డి చెక్కులు ఇవ్వటంతో అమర్​ గ్యాంగ్ మరో 2కోట్ల రూపాయలు డిమాండ్​ చేసింది. దాంతో రంగారెడ్డి గోల్కొం డ(Golkonda Police) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు అమర్ అతని ముఠా సభ్యులను గోల్కండ ప్రాంతానికి పిలిపించాలని రంగారెడ్డికి సూచించారు. ఈ మేరకు డబ్బు కావాలంటే గోల్కొండ ప్రాంతానికి రావాలని రంగారెడ్డి చెప్పాడు. నగదును తీసుకోవటానికి వచ్చిన అమర్, మౌలాలి, రాజేశ్, మంజుల, రజనీలను గోల్కొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: Janagama District: రేషన్ షాపుల్లో వినియోగ‌దారుల అరిగోసలు.. ఉరుకులు పరుగులతో జనాలు..?

Just In

01

Splitsville review: ఈ బోల్డ్ కామెడీ చూడాలనుకుంటే ఏం చేయాలో తెలుసా..

Chhattisgarh Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తెలుగు అగ్రనేతలు హతం

Digital Arrest: పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉందంటూ వృద్ధుడి డిజిటల్ అరెస్ట్

Telusu Kada second song: సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ నుంచి సెకండ్ మెలొడీ.. అదిరింది మావా..

Harish Rao: రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం.. హరీష్ రావు ఫైర్