Vasuki Anand: అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి వాసుకి (పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ ఫేమ్) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read- Pawan Kalyan: ఒక వైపు షూటింగ్.. మరో వైపు డబ్బింగ్.. మెంటలెక్కిస్తోన్న పవర్ స్టార్!
టీనేజ్ పిల్లలు ఈ సినిమా చూడాలి
ఈ సందర్భంగా నటి వాసుకి మాట్లాడుతూ .. ‘బ్యూటీ’ సినిమాలో నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన టీమ్‌కు థాంక్స్. ‘తొలిప్రేమ’ నుంచి ఇప్పటి వరకు నాకు నచ్చిన పాత్రలు, కథలను మాత్రమే ఎంచుకుంటూ వస్తున్నాను. ఈ ‘బ్యూటీ’ కథ నా మనసుని ఎంతగానో హత్తుకుంది. కథ విన్న వెంటనే మా నాన్న, నా భర్తే గుర్తుకొచ్చారు. తల్లిదండ్రులతో కలిసి పిల్లలు చూడాల్సిన సినిమా ఇది. ఏ ఫ్యామిలీలో గొడవలు ఉన్నా.. ఈ మూవీని చూస్తే అవన్నీ సమసిపోతాయి. నరేష్ సార్‌లో మా నాన్నను చూసుకున్నాను. ఆయన నన్ను సెట్స్‌లో ఎంతో బాగా చూసుకునేవారు. ‘బ్యూటీ’ వంటి చిత్రంలో నటించినందుకు గర్వంగా, సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. టీనేజ్ పిల్లలు ఈ మూవీని కచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాను. సమాజానికి ఎంతో విలువైన సందేశాన్ని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్‌కి సరిపడే సినిమా ఇదని భావిస్తున్నానని అన్నారు.
Also Read- Maruthi: చెప్పుతో కొట్టుకున్న ‘బార్బరిక్’ దర్శకుడికి పబ్లిగ్గా డైరెక్టర్ మారుతి క్లాస్!
ప్రతీ ఇంట్లో జరిగే కథ ఇది
నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ.. తెలుగు సినీ చరిత్రలో దాసరి టీమ్ నుంచి ఎక్కువ మంది దర్శకులు ఇండస్ట్రీలోకి వచ్చారు. మళ్లీ ఇప్పుడు మారుతి టీమ్ నుంచి ఎక్కువ మంది దర్శకులు వస్తున్నారు. మారుతి చరిత్రలో నిలిచిపోతారు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాకు మొదటి సారి మారుతితో పని చేశాను. ఆ తర్వాత మళ్లీ నాకు కామెడీ చిత్రాలు వచ్చాయి. ఎస్.కే.ఎన్ అద్భుతమైన సినిమాలు నిర్మిస్తున్నారు. సుబ్బు, సాయి, వర్దన్ ఈ సినిమాకు సూర్యచంద్రుల వంటి వారు. ప్రతీ ఇంట్లో జరిగే కథ ఇది. ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా తీశారు. కథ చెప్పినప్పుడే నేను ఎంతగానో ఇన్వాల్వ్ అయ్యాను. మ్యూజిక్, కెమెరా వర్క్ ఈ మూవీకి రెండు కళ్లు. ఆర్ఆర్ చూసి నాకు గూస్ బంప్స్ వచ్చాయి. సాయి కుమార్ విజువల్స్ అదిరిపోతాయి. ఈ మూవీలో నటించినందుకు గర్వకారణంగా ఉంది. నీలఖిని చూసిన తర్వాత ఈ మూవీ హిట్ అని అనిపించింది. వాసుకి ఇంటెలిజెంట్ నటి. అంకిత్ నటన చూసి అంతా సర్ ప్రైజ్ అవుతారు. ‘బ్యూటీ’ కన్నుల పండుగగా ఉంటుంది. ఎమోషన్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమా ఇస్తుంది. సెప్టెంబర్ 19న ఈ ‘బ్యూటీ’ని అందరూ చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు