Adivi Sesh: మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts). ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించగా, ఆదిత్య హాసన్ నిర్మించారు. బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా థియేట్రికల్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమా చూసిన వారంతా, సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తోన్న విషయం తెలిసిందే. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా ఈ సినిమాపై స్పెషల్ పోస్ట్‌లు చేస్తుండటం విశేషం. కేవలం రూ. 2.5 కోట్లతో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా.. దాదాపు రూ. 30 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లుగా నిర్మాత బన్నీ వాస్.. రీసెంట్‌గా మీడియా సమావేశంలో ప్రకటించారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో అడివి శేష్, డైరెక్టర్ మారుతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Also Read- Pawan Kalyan: ఒక వైపు షూటింగ్.. మరో వైపు డబ్బింగ్.. మెంటలెక్కిస్తోన్న పవర్ స్టార్!
కాత్యాయని పాత్రకు ఆమెనే ఎందుకు?
ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు వస్తున్న టాక్ విని, నా సినిమా షూటింగ్ కాస్త ఎర్లీగా పూర్తి చేసుకుని సినిమా చూశాను. అందరిలాగే నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో కామెడీతో పాటు ఒక ఇన్నోసెన్స్ కూడా ఉంది. కామెడీ పంచ్ వేసినవారు, ఆ పంచ్‌ని తీసుకున్నవారు ఇద్దరూ హ్యాపీగా ఫీలవుతారు. ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించారు. శివానీని మౌళికి జోడీగా చూసిన తర్వాత.. ఈ అమ్మాయి వయసులో కాస్త పెద్దదిగా ఉన్నట్లుందే అనిపించింది. కానీ, కాత్యాయని పాత్రకు ఆమెనే ఎందుకు తీసుకున్నారో ఈ సినిమా పూర్తిగా చూసిన తర్వాత నాకు అర్థమైంది. కాత్యాయనిగా శివానీ ఎక్స్‌లెంట్‌గా నటించింది. డైరెక్టర్ సాయి మార్తాండ్ రోజుకు 16 గంటల పాటు.. నెలరోజులకు పైగా ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటాడో ఊహించగలను. సినిమా రిలీజై సక్సెస్ అయ్యాక ఎంతో మంది ఎన్నో చెబుతుంటారు. కానీ సాయి మార్తాండ్ చాలా హంబుల్‌గా ఉండటం చూసి నాకు ముచ్చటేసింది. సెకండాఫ్‌లో హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి. అది దర్శకుడిగా సాయి మార్తాండ్ క్రాఫ్ట్. నాకు కూడా అతని డైరెక్షన్‌లో మూవీ చేయాలని ఉంది. హీరో మౌళి మరింత పెద్ద స్టార్ కావాలి. బన్నీ వాస్, వంశీ ఈ చిత్రానికి కావాల్సిన పర్పెక్ట్ రిలీజ్ ఇచ్చారని అన్నారు.
Also Read- Ram Gopal Varma: ‘మిరాయ్’పై మరో ట్వీట్.. వర్మకి టాపిక్ దొరికిందోచ్!
చిన్న చిత్రాలకు లైఫ్
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సక్సెస్ చిన్న చిత్రాలకు మరోసారి దారి చూపించినట్లయింది. చిన్న చిత్రాలకు ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదని భయపడే పరిస్థితి ఉంది. కానీ ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్‌కు వచ్చి చూస్తుండటంతో.. మరోసారి చిన్న చిత్రాలకు లైఫ్ వచ్చినట్లుగా భావిస్తున్నారు. నాకు ‘ఈ రోజుల్లో’ సినిమా సాధించిన విజయం గుర్తొస్తొంది. ఒక చిన్న సినిమా హిట్ అయితే వంద సినిమాలు తీసే ధైర్యం వస్తుంది. ‘లిటిల్ హార్ట్స్’ టీమ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారి సక్సెస్ చూస్తుంటే నాకూ చాలా హ్యాపీగా ఉంది. ఈటీవీ విన్ నితిన్ రెడ్డి, సాయి కృష్ణ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. వాళ్లు ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ మరిన్ని చేయాలి. ‘రాజా సాబ్’ షూటింగ్ కంప్లీటైంది. సాంగ్స్ చిత్రీకరించాలి. రాజా సాబ్ గురించి ఇప్పుడే చెప్పను, చేసి చూపిస్తానని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు