Ramanjaneyulu Jawvaji
ఎంటర్‌టైన్మెంట్

Bhadrakaali: దసరా నవరాత్రుల సమయంలో ‘భద్రకాళి’.. సక్సెస్ పక్కా అంటోన్న నిర్మాత!

Bhadrakaali: ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన విజయ్ ఆంటోనీ (Vijay Antony).. ‘మార్గాన్’ తర్వాత మరో పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ ‘భద్రకాళి’ (Bhadrakaali)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. విజయ్ ఆంటోనీ ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి స్పందననే రాబట్టుకుంది. సెప్టెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను నిర్మాత రామాంజనేయులు జవ్వాజీ (Producer Ramanjaneyulu Jawvaji) మీడియాకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Pawan Kalyan: ఒక వైపు షూటింగ్.. మరో వైపు డబ్బింగ్.. మెంటలెక్కిస్తోన్న పవర్ స్టార్!

వరుస సినిమాలు

‘‘విజయ్ ఆంటోనీ, నేను ఎప్పటి నుంచో మంచి మిత్రులం. విజయ్ ఆంటోనీ ఫిలిం ఫ్యాక్టరీ, మా బ్యానర్ సర్వంత్ రామ్ క్రియేషన్స్ కలిపి కొన్ని మూవీస్ చేయాలని భావించి ఈ జర్నీ స్టార్ట్ చేశాం. ‘మార్గాన్’ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19 వస్తోంది. ఈ సినిమా కూడా ఘన విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. ఇటీవలే ‘బూకి’ అనే సినిమాను కూడా మొదలుపెట్టాం. మలయాళంలో మరో సినిమా చేస్తున్నాం. అది చివరి దశకు చేరుకుంది. మా రెండు బ్యానర్స్‌లో ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే వాటి వివరాలు తెలియజేస్తాం. బిచ్చగాడు డైరెక్టర్ శశి, విజయ్ ఆంటోని కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ఆ సినిమా ప్రకటిస్తాం. ఇలా మా నుంచి వరుసగా సినిమాలు రాబోతున్నాయి.

Also Read- Maruthi: చెప్పుతో కొట్టుకున్న ‘బార్బరిక్’ దర్శకుడికి పబ్లిగ్గా డైరెక్టర్ మారుతి క్లాస్!

చాలా డిఫరెంట్ పాత్ర

‘భద్రకాళి’ విషయానికి వస్తే.. డైరెక్టర్ అరుణ్ ప్రభు చెప్పిన కథ చాలా బాగుంది. అతను అంతకుముందు తీసిన రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. ‘భద్రకాళి’ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ప్రేక్షకులను ఆలోచింపచేసే అంశాలు కూడా ఉన్నాయి. ఇది విజయ్ ఆంటోనీ 25వ సినిమా. అద్భుతమైన కంటెంట్‌తో వస్తున్న సినిమా ఇది. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీలో ఒకేసారి రిలీజ్ చేస్తున్నాం. సినిమాకు పెట్టిన భద్రకాళి టైటిల్‌తో.. సరిగ్గా దసరా నవరాత్రుల సమయంలోనే ఈ సినిమా రావడం కలిసి వచ్చిందని ‘మార్గాన్’ సినిమాను రిలీజ్ చేసిన మా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. ‘మార్గాన్’ కంటే ఈ సినిమాకి 20 శాతం థియేటర్స్ పెరిగే అవకాశం ఉందని కూడా అన్నారు. వారు ఆ మాట చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటి వరకు పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి.. కానీ, ఈ సినిమాలో హీరో చేసిన క్యారెక్టర్‌తో ఇప్పటివరకు ఎలాంటి సినిమా రాలేదని కచ్చితంగా చెప్పగలను. చాలా డిఫరెంట్ పాత్ర. ఇందులో చాలా మంచి స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సమాజంలో జరుగుతున్న విషయాల్ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. సినిమా చూస్తున్న అందరూ పర్సనల్‌గా కనెక్ట్ అవుతారు. ఫస్ట్ కాపీ చూశాం. సినిమా సక్సెస్‌‌పై చాలా నమ్మకంగా ఉన్నాం. తెలుగులో సత్యదేవ్‌తో ‘ఫుల్ బాటిల్’ అనే సినిమా చేస్తున్నాం. షూటింగ్ కంప్లీటైంది. నవంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Pawan Kalyan: ప్రకృతితో చెలగటాలు ఆడొద్దు అంటున్న నెటిజన్స్

Huzurabad District: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు