Illegal Constructions: తుంకుంట మున్సిపల్ పరిధిలో జోరుగా అనుమతులు లేని నిర్మాణాలు కొనసాగుతున్న అధికారులకు మాత్రం కూడా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమాలకు తావు లేదని, అక్రమ నిర్మాణాలు గానీ, కబ్జాలు గాని చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా కబ్జాదారులు జంకుతలేరు. అక్రమ నిర్మాణాలు, నాళాల కబ్జాలు, భూ కబ్జాల పై ప్రభుత్వం హైడ్రా పేరుతో చర్యలు తీసుకున్న అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. అక్రమ నిర్మాణాలకు చేస్తున్న, కబ్జా చేస్తున్న వారిపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నా భయపడటం మాత్రం లేదు.
తూముకుంట మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో గల సర్వే నెంబర్ 334 లోని సాయి నగర్ కాలనీలో (ల్యాండ్ మార్క్) వైట్ హౌస్ పక్కన అక్రమ నిర్మాణం జరుగుతుందని తుంకుంట మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా నోముల మధుసూధనరెడ్డి, నోముల సులోచన రెడ్డి ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులను ప్రశ్నించగా నోటీసులు ఇచ్చామని పరోక్షంగా అక్రమ నిర్మాణాలను అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నామని మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ తెలిపారు.
స్పందించని అధికారులు
అక్రమ నిర్మాణాలపై వివరణ కోరేందుకు తూముకుంట మున్సిపల్ అధికారులను సంప్రదించగా అధికారులు స్పందించలేదు. ఇంత నిర్లక్ష్యంగా అధికారుల ప్రవర్తన ఉండడం సరైనది కాదన్నారు.