madhuri ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Duvvada Srinivas: నేను, మాధురి అందుకే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళలేదు.. దువ్వాడ శ్రీనివాస్

Duvvada Srinivas: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ గా లాంచ్ అయింది. కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోకి వెళ్ళారు. అయితే, ఈ సారి సీజన్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి కూడా ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ, తీరా లాంచ్ ఎపిసోడ్ లో వీరిద్దరూ లేక పోయేసరికి కొందరు షాక్ అయ్యారు. అంతే కాదు, మాధురి కుడా పలు ఇంటర్వ్యూల్లో ఈ సారి ఉంటానని హింట్ ఇచ్చింది. కానీ, ఆశ్చర్యకరంగా వీరిద్దరిలో ఒక్కరూ కూడా బిగ్ బాస్ ఇంట్లో కనిపించలేదు.

Also Read: Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.. వైరల్ అవుతున్న నాగార్జున, శ్రష్ఠి వీడియో.. ఎలిమినేట్ చేశారా లేక బయటకు రప్పిస్తున్నారా?

అయితే, తాజాగా ఈ విషయంపై దువ్వాడ శ్రీనివాస్ ఓ ఛానెల్ కి ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో స్పందిస్తూ నమ్మలేని నిజాలను వెల్లడించారు. “ బిగ్ బాస్ టీమ్ నుంచి మాకు కాల్ వచ్చింది. వారు కూడా మా వద్దకు వచ్చి మాట్లాడారు, అగ్రీమెంట్ సైన్ చేయలనీ చెప్పారు. సెప్టెంబర్ 7 నుంచి షో స్టార్ట్ అవుతుందని చెప్పారు. కానీ, మూడు నెలల పాటు హౌస్‌లోనే ఉండాలని చెప్పారు. ఒకవేళ రెండు మూడు వారాల్లో ఎలిమినేట్ అయితే పర్వాలేదు, కానీ మూడు నెలలు అక్కడే ఉండడమంటే మాకు చాలా కష్టమవుతుంది. మా బిజినెస్‌లు, పెట్టుబడులు, విశాఖపట్నంలో ఒక బ్రాంచ్, జూబ్లీ హిల్స్‌లో మరో బ్రాంచ్ సిద్ధమవుతోంది. ఇన్ని బాధ్యతల మధ్య ఈ షోలో పాల్గొనడం కరెక్ట్ కాదని భావించాం” అని శ్రీనివాస్ వెల్లడించారు.

Also Read: Renu Agarwal Murder Case: రేణు అగర్వాల్ హత్య కేసులో.. క్యాబ్ డ్రైవర్​ ఇచ్చిన సమాచారంతో వీడిన మిస్టరీ.. కారణాలు ఇవే?

అలాగే, సినిమా రంగంపై తనకున్న ఆసక్తిని గురించి కూడా ఆయన మాట్లాడారు. “ సినిమాలంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టం. నేను డిప్లొమా ఇన్ ఫిల్మ్ ట్రాకింగ్ (డీఎఫ్‌టీ), డీఎఫ్‌ఏ కోర్సులు చేశాను. అవకాశాలు రాకపోవడంతో సినిమా ఫీల్డ్‌లో స్థిరపడలేకపోయాను. ఆ తర్వాత రాజకీయాల్లో సెటిల్ అయ్యాను. అయినా, ‘వలంటీర్’ అనే సినిమాను నేను, మాధురి కలిసి నిర్మించాం. అందులో ఫైట్స్ కూడా ఉన్నాయి, కానీ విజువల్ వాల్యూస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. సినిమా తీసి, విడుదల చేశాం. ఇప్పుడు చాలా మంది తర్వాత ప్రాజెక్ట్ గురించి ఏంటి అని అడుగుతున్నారు. సినిమాలపై ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, భవిష్యత్తులో ఏదైనా చేస్తామేమో, చూద్దాం!” అని ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు. బిగ్ బాస్‌లో దువ్వాడ శ్రీనివాస్, మాధురి లేకపోవడం అభిమానులకు నిరాశ కలిగించినా..  ఈ విషయంపై క్లారిటీ అయితే ఇచ్చింది. భవిష్యత్తులో వీరు సినిమా రంగంలో మళ్లీ సందడి చేస్తారేమో, చూడాలి.

Also Read: SPDCL CMD Orders: జీరో ఫిర్యాదులే లక్ష్యంగా పని చేయాలి.. ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశం

Just In

01

Delhi Blast: ఒక్కొక్కటిగా వెలుగులోకి నిజాలు.. ఇంటెలిజెన్స్ తాజా అనుమానం ఇదే

Jubilee Hills Bypoll: పోలింగ్ రోజూ పంపకాల జోరు?.. జూబ్లీహిల్స్‌లో ఎంత పంచారంటే?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బై పోలింగ్ లో హీట్ ట్రెండ్.. మాస్ లోని మెజార్టీ లంతా నవీన్ వైపే?

Delhi Blast: పేలుడుకు ముందు 3 రోజులపాటు అండర్‌గ్రౌండ్‌లోకి ఉమర్.. వెలుగులోకి సంచలన నిజాలు

Gadwal District: నిధులు లేక నిరీక్షణ రెండేళ్ల నుంచి రాని గ్రాంట్లు.. చెక్కులు పాస్ కాక పంచాయతీ కార్యదర్శుల అవస్థలు