Thatikonda Rajaiah: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari) నా నోటికాడి బుక్కలాక్కున్నాడని, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) తీవ్రస్థాయిలో మంది పడ్డారు. వేలేరు మండలంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశిలో రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరికి సిగ్గు, శరం, చీము, నెత్తురుంటె బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. పౌరుషం ఉంటే, నువ్వు వెంటనే రాజీనామా చేసి రావాలని సవాల్ విసిరారు. కడియం శ్రీహరి 200 కోట్లకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీలో చేరాడని ఆరోపించారు.
Also Read: Biggest Baby: అమెరికాలో మహాబలుడు.. పుట్టుకతోనే కొత్త చరిత్ర.. ఈ బుడ్డోడు మాములోడు కాదు!
పార్టీ ఫిరాయించిన కడియం
టాల్ మ్యాన్(Tall Man) అని చెప్పుకుంటావు కదా ఏమైంది కడియం శ్రీహరి నీ పౌరుషం అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోవడానికి భయపడుతున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటివరకు స్పీకర్ కు వివరణ ఇవ్వలేదన్నారు. పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి పై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే స్పీకర్(Speekar) ను న్యాయస్థానానికి లాగుతామన్నారు. కుక్కకు ఉన్న విశ్వాసం, ఇంగిత జ్ఞానం కడియం శ్రీహరికి లేదన్నారు. ఒకవేళ బిఆర్ఎస్(BRS) పార్టీలోనే ఉంటే ఒప్పుకొని ముక్కు నేలకు రాసి కేసిఆర్(KCR) ని కలువు బిఆర్ఎస్(BRS) లో ఉంటే తెలంగాణ భవన్ కు రా.. యూరియా(Urea) సమస్యల మీద మాట్లాడు అన్నారు. బిఆర్ఎస్ కు న్యాయం చేసేవిధంగా చెంపలు వేసుకొని ముందుకు వస్తే తప్పకుండా నిన్ను బిఆర్ఎస్ ఎమ్మెల్యే అంటామన్నారు.
Also Read: Jangaon Protest: వంతెన నిర్మాణం చేసేదాక మా ఊరు రావోద్దు.. గ్రామస్తుల ఆందోళన
