Hanumakonda District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Hanumakonda District: రైతు రుణమాఫీ అయినా.. రుణం డబ్బులు వసూళ్లు.. ఎక్కడంటే..?

Hanumakonda District: రుణమాఫీ అయినా రైతుల నుంచి ఋణం డబ్బులు వసూలు చేస్తున్న తీరుపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రుణ మాఫీ పత్రం(Loan waiver document) ఇచ్చిన బ్యాంకు డబ్బులు కట్టాలని డిమాండ్ నోటీస్ పంపడం రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ(Hanumakonda) జిల్లా కమలాపూర్(kamalapur) మండలం నేరేళ్ళ గ్రామానికి చెందిన అల్లాటి రాజేశ్వర రావు అనే రైతుకు 2008వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రైతు రుణ మాఫీ పత్రం జారీ చేసింది.

డబ్బులు చెల్లించాలని డిమాండ్

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తీసుకున్న రుణం మాఫీ అయినట్లు నాటి ప్రభుత్వం మంజూరు పత్రాన్ని రైతుకు అందజేసింది. 2017 లో తనకు వేరే బ్యాంక్ ద్వారా రుణం పొందడం కోసం ప్యాక్స్ నో డ్యూస్ సర్టిఫికెట్(Pax No Deus Certificate) ను అందజేసింది. 2019లో సొసైటీ అధికారులు తన ఇంటి వద్దకు వచ్చి రుణం డబ్బులు చెల్లించాలని డిమాండ్ నోటీసుకు జారీ చేయడంతో చేసేదేమీ లేక పది వేల రూపాయలు చెల్లించినట్లు రైతు తెలిపారు. రుణమాఫీ వచ్చిన నాలాంటి చిన్న, సన్నకారు రైతులను బ్యాంకు అధికారులు నానా ఇబ్బందులు పెడుతూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Eead: Daggubati Brothers: విచారణకు హాజరుకాని దగ్గుబాటి బ్రదర్స్.. కోర్టు సీరియస్​

మళ్ళీ డబ్బులు కట్టాలని..

బ్యాంకు అధికారులపై సంబంధిత అధికారులకు పిర్యాదు చేసినట్లు రైతు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి నాకు రుణ మాఫీ(Loan waiver) అయినప్పటికీ మళ్ళీ డబ్బులు కట్టాలని నన్ను ఇబ్బందులకు గురి చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతు వేడుకొన్నారు. ఈ విషయంపై బ్యాంకు సీఈవో చితేమియ ను వివరణ కోరగా అప్పుడు సదరు రైతుకు అప్పటి ప్రభుత్వం కొన్ని కిస్తీలు మాత్రమే రుణ మాఫీ వచ్చింది. పెండింగ్ ఉన్న అమౌంట్ మాత్రమే చెల్లించాలని కోరాం తప్ప వేదింపులు చేశామని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

Also Read: Krishna Water Dispute: చుక్క నీరు కూడా వదలం.. తెలంగాణ వాటా సాధిస్తాం.. మంత్రి ఉత్తమ్ కుమార్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!