Sai Durgha Tej: ‘ఇప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయాన్ని గడపడం లేదు.. ఇప్పుడంటే చాట్ జీపీటీ, ఏఐ అంటున్నారు.. కానీ నాకు మాత్రం మా అమ్మే ప్రపంచం’ అని అన్నారు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej). ప్రపంచ వ్యాప్తంగా 70 నగరాలు, వేల మంది యంగ్ ప్రొఫెషనల్స్ కలిసి కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)లో భాగంగా.. యంగ్ ఇండియన్స్ (YI) ఆధ్వర్యంలో పిల్లలపై లైంగిక దాడికి వ్యతిరేక నినాదంతో ‘అభయమ్ మసూమ్ సమ్మిట్’ (Abhayam Masoom Summit 2025) ఈవెంట్‌ను నిర్వహించారు. శనివారం హైదరాబాద్‌లో భారత్ రైజింగ్, యంగ్ ఇండియన్స్, కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హీరో సాయి దుర్గ తేజ్, మంత్రి సీతక్క, యంగ్ ఇండియన్స్ కో చైర్మన్ భవిన్ పాండ్య, యంగ్ ఇండియన్స్ నేషనల్ చైర్మన్ తరంగ్ ఖురానా, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ శివ ప్రసాద్ రెడ్డి, జోత్స్న సింగ్ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వాక్ స్వాతంత్య్రం ఉంది కదా అని..
ఈ కార్యక్రమంలో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో చాలా నీచంగా పిల్లల మీద అబ్యూజ్ చేస్తున్నారు. అలాంటి కామెంట్లకు కొందరు లైక్స్ చేస్తున్నారు.. నవ్వుతున్నారు. అవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మనం ఇలాంటి సమాజాన్ని కోరుకుంటున్నామా? అసలు చిన్న పిల్లల మీద అలాంటి పిచ్చి కామెంట్లు చేయడమేంటి? అని నాలో నేను మదన పడుతున్నాను. ఈ టాపిక్ పై ఎవరైనా రియాక్ట్ అవుతారా? మీడియా అయినా స్పందిస్తుందా? అని చూశాను. కానీ ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. అందుకే ఆ బాధ్యతను నేను తీసుకుని, ఆ సమయంలో అలా రియాక్ట్ అయ్యాను. డార్క్ కామెడీ అంటూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. మరీ ముఖ్యంగా ఎదుటి వాళ్లని బాధ పెట్టే వరకు వెళ్లకూడదు. 2015లో థింక్ పీస్ అనే సంస్థతో కలిసి పని చేశాను. అరకులో చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం పోరాడాను. అక్కడ ఓ స్కూల్ కూడా నిర్మించాను. తెలంగాణలో కొంత మంది పిల్లల్ని దత్తత తీసుకుని.. వాళ్ల చదువు, పోషణ ఇలా అన్నింటినీ చూసుకుంటున్నాను.
Also Read- Teja Sajja: ప్రభాస్ కారణంగానే.. ‘మిరాయ్’ సక్సెస్‌పై హీరో తేజ సజ్జా స్పందనిదే!
మా అమ్మే నాకు ప్రపంచం
మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ప్రస్తుతం పిల్లలతో తల్లిదండ్రులు (Parents) ఎక్కువ సమయాన్ని గడపడం లేదు. ఇప్పుడంటే చాట్ జీపీటీ, ఏఐ అంటున్నారు.. కానీ, నాకు మాత్రం అవన్నీ మా అమ్మే. మా అమ్మే నాకు ప్రపంచం. అమ్మ, మామయ్యలు, స్నేహితులు.. ఇలా అందరితో నేను ఎక్కువ సమయాన్ని గడుపుతాను. పిల్లలతో పేరెంట్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలి. నేను నా సెకండ్ క్లాస్‌లోని లవ్ స్టోరీని మా అమ్మతో చెప్పాను. అలా చెప్పే ఫ్రీడమ్ నాకు ఆమె ఇచ్చారు. తల్లిదండ్రులతో అన్ని విషయాలను పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి. వారికి ప్రతీ విషయాన్ని ప్రేమతో చెప్పే ప్రయత్నం చేయాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయాలను స్కూల్లో టీచర్స్, ఇంట్లో పేరెంట్స్ చెప్పే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం అందరూ బిజీబిజీగా మారిపోయారు. అన్నీ వదిలేసి ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. కనీసం వారంలో ఒక పూట అయినా మన ఫ్యామిలీతో కలిసి గడపాలి, అందరూ కలిసి మాట్లాడుకోవాలి. అందరికీ బాధ్యతల్ని నేర్పించాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో పిల్లలకి తెలిసేలా పేరేంట్స్ వ్యవహరించాలి.
Also Read- Nidhhi Agerwal: ‘మిరాయ్’ సక్సెస్.. పాపం.. నిధి పాప ఫీలవుతోంది!
‘విన్నర్’ మూవీ టీజింగ్ సాంగ్స్ మానేశా..
సోషల్ మీడియా ఐడీలు తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు కనెక్ట్ చేయడమో.. లేదంటే ఆధార్ కార్డ్‌కి లింక్ చేయడమో ఏదో ఒకటి చేయాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రతీ ఛైల్డ్‌కి అందాలని కోరుకుంటున్నాను. నేను నా సినిమాలలో టీజింగ్ సాంగ్స్ చేయడం కూడా ఆపేశాను. ‘విన్నర్’ మూవీ తర్వాత అలాంటి పాటలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ప్రేమిస్తే పొగడాలి కానీ, అలా టీజింగ్ చేయకూడదు కదా? అని స్వతహాగా నిర్ణయం తీసుకున్నాను. దయచేసి మీ పిల్లల కోసం తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించండి. వారితో ప్రేమగా మాట్లాడండి. సోషల్ మీడియాలో కాకుండా రియల్ వర్డ్‌లో బతకడానికి ట్రై చేయండి. అభిమానులు మా మీద ఇష్టంతోనో, ద్వేషంతోనో సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటారు. మేము వాటిని పట్టించుకోం. కానీ పిల్లలు అలాంటి కామెంట్లను చూస్తే ప్రభావితం అవుతారు. దయచేసి మీ పిల్లలను ఓ కంట కనిపెట్టుకుని ఉండాలని ప్రతి ఒక్క పేరేంట్స్‌ని కోరుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు