Teja Sajja
ఎంటర్‌టైన్మెంట్

Teja Sajja: ప్రభాస్ కారణంగానే.. ‘మిరాయ్’ సక్సెస్‌పై హీరో తేజ సజ్జా స్పందనిదే!

Teja Sajja: సూపర్ హీరో తేజ సజ్జా (Teja Sajja) నటించిన ‘మిరాయ్’ (Mirai Movie) చిత్రం బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్‌గా థియేటర్లలో దూసుకెళుతోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు (Manchu Manoj) పవర్ ఫుల్ పాత్రను పోషించగా.. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, శ్రియా శరణ్, జయరామ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్రహ్మండమైన సక్సెస్‌ను అందుకుని, హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో అద్భుతాలను సృష్టిస్తోంది. చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని తమ ఆనందాన్ని తెలియజేసేందుకు మేకర్స్ శనివారం థ్యాంక్ యూ మీట్ నిర్వహించారు.

Also Read- Beauty Trailer: యువ సామ్రాట్ నాగ చైతన్య వదిలిన ‘బ్యూటీ’ ట్రైలర్ ఎలా ఉందంటే..

వారి వల్లే ఈ సినిమా సాధ్యమైంది

ఈ కార్యక్రమంలో సూపర్ హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. ‘మిరాయ్‌’ని మీ గుండెల్లో పెట్టి ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. అందరి సపోర్ట్ వల్లే నేను సినిమాలు చేయగలుగుతున్నాను. ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నాను. ఆడియన్స్, మీడియా అందరూ కలిసి నాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారని భావిస్తున్నాను. ఈ సినిమాకు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌తో మా టీమ్ అంతా సంతోషంగా ఉంది. సినిమా చూసిన ప్రేక్షకులు సపరేట్‌గా రీల్స్ చేస్తూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంటే.. చాలా చాలా ఆనందంగా అనిపించింది. అందరి సపోర్ట్‌కు థాంక్యూ. డైరెక్టర్ కార్తీక్, నిర్మాత విశ్వప్రసాద్.. వారి వల్లే ఈ సినిమా సాధ్యమైంది. వాళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమానే లేదు. డైరెక్టర్ కార్తీక్ ఉన్నాడు కాబట్టే ఈ సినిమా ఉంది. ఏ సినిమా అయినా డైరెక్టర్‌తోనే ప్రారంభమవుతుంది. మా వెనుక ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా, ఒక పిల్లర్ లాగా నిర్మాత నిలబడ్డారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా మీద ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.

Also Read- Nidhhi Agerwal: ‘మిరాయ్’ సక్సెస్‌.. పాపం.. నిధి పాప ఫీలవుతోంది!

ప్రభాస్ ఈ కథని నరేట్ చేయడం వల్లే

మనోజ్ అన్నకు థాంక్యూ సో మచ్. ఆయన ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో.. సినిమా మరో స్థాయికి వెళ్ళింది. రితికాకు థాంక్యూ. తను ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు ట్రావెల్ అయింది. హరి గౌరా మ్యూజిక్‌కి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సినిమా కోసం తను ఎంతో ప్యాషన్‌తో వర్క్ చేశాడు. మా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లారు. హనుమాన్ సినిమాకు రానా ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయన చేసిన సపోర్ట్ మర్చిపోలేను. కంటెంట్ చూసి సపోర్ట్ చేస్తానని వచ్చారు. ఈ సినిమా చూసి నేను కూడా ఈ సినిమా కోసం ఏదైనా చేస్తానని ముందుకు వచ్చారు. నిజానికి ఆయనకు ఏ లాభం లేకపోయినా మంచి సినిమా కోసం నిలబడినందుకు థ్యాంక్యూ. టీమ్ అంతా ఎంతగానో సపోర్ట్ చేయడం వల్లే ఈ విజయం వచ్చిందని భావిస్తున్నాను. సినిమా విఎఫ్ఎక్స్ గురించి అందరూ అద్భుతంగా మాట్లాడుతుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. మా టీమ్ అంతా కూడా ఒక మంచి సినిమా ఇవ్వాలనే ప్యాషన్‌తో కష్టపడ్డాం. కుర్రాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే మా గోల్డెన్ హార్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) అన్నకు థ్యాంక్యూ. సినిమా బిగినింగ్‌లో ప్రభాస్ అన్న ఈ కథని నరేట్ చేయడం వల్లే ఈ కథకు, సినిమాకు ఇంత వెయిటేజ్ వచ్చింది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిరాయ్ అందరికీ నచ్చే సినిమా. అందరూ థియేటర్స్‌కు వచ్చి, సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Thiruveer: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎలా ఉంటుందంటే..

Suriya: ఒక కామన్ మ్యాన్‌, కింగ్ సైజ్‌లో కనిపించాలంటే.. రవితేజ తర్వాతే ఎవరైనా?

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?