Beauty Trailer: వెండితెరపైకి ఓ అందమైన ప్రేమకథ వచ్చి చాలా కాలం అవుతుంది. అలాంటిది.. ‘అందం’తోనే ఓ ప్రేమ కథ వస్తే.. ఇంకెంత అందంగా ఉంటుందో ఆలోచించండి. అవును ‘బ్యూటీ’ అనే టైటిల్‌తో ఇప్పుడో ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో కేవలం ప్రేమకథ మాత్రమే కాదు.. అంతకు మించిన కుటుంబ విలువలు, ఫాదర్ డాటర్ రిలేషన్, ఎమోషనల్ కంటెంట్.. ఇలా అన్ని సమపాళ్లలో ఉంటాయని అంటున్నారు ‘బ్యూటీ’ టీమ్. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బ్యూటీ’ (Beauty). సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోందీ చిత్రం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా చిత్ర ట్రైలర్‌ను యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) విడుదల చేసి, టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read- Bigg Boss Telugu 9: కాసేపట్లో బాక్సులు బద్దలవుతాయ్.. నాగ్ హింట్ అదేనా?
‘భలే ఉన్నాడే’ ఫేమ్ దర్శకత్వంలో..
ఇప్పుడిప్పుడు హీరోగా నిలదొక్కుకుంటున్న అంకిత్ కొయ్య (Ankith Koyya) హీరోగా, నీలాఖి (Nilakhi Patra) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మిస్తున్నారు. ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ప్రస్తుతం మేకర్స్ చిత్ర ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విడుదలైన ట్రైలర్ అందరి మనసులను దోచుకుంటోంది. ఒక్కసారి ఈ ట్రైలర్‌ను గమనిస్తూ..
Also Read- Ritu Varma: తత్వం బోధపడినట్లుంది.. గ్లామర్ ట్రీట్‌కు రెడీ అంటూ హింట్ ఇచ్చేసిందిగా!
డైలాగ్స్ హైలెట్
‘ఎప్పుడైనా నేను నిన్ను కొప్పడితే నన్ను అలా వదిలి పెట్టి వెళ్ళకు’, ‘నిన్ను వదిలేసి వెళ్ళడం అంటే.. నా ఊపిరి వదిలేయడమే కన్నా’ అంటూ హీరో హీరోయిన్లు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. స్కూటీ కొనిస్తాను అని తండ్రి మాట ఇవ్వడం, మిడిల్ క్లాస్ ఫాదర్ ఎమోషన్స్, ‘క్యాబ్ డ్రైవర్ అయితే క్యాబ్ డ్రైవర్‌లా ఉండాలి గానీ.. కలెక్టర్‌లా ప్రామిస్ చేయవద్దు’ అనే డైలాగ్.. ఇలా ప్రతి ఒక్క డైలాగ్ పేలింది. ట్రైలర్‌లోని డైలాగ్స్ హైలెట్ అనేలా ఉంటే.. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, ఫాదర్ డాటర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ కష్టాలు ఇలా అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మ్యూజిక్, ఆర్ ఆర్, విజువల్స్ అన్నీ కూడా వావ్ అనేలా ఉన్నాయి. నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు ఇతర పాత్రలలో నటించిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుని, మంచి సక్సెస్ అవుతుందనేలా.. ట్రైలర్‌తో సినిమాలోని కంటెంట్‌ని మేకర్స్ తెలియజేశారు. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా వాటి జాబితాలో చేరే ఛాన్స్ ఉందనేలా ఈ ట్రైలర్ హింట్ ఇస్తోంది. చూద్దాం.. సెప్టెంబర్ 19న వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు