Hanumakonda Task Force: హనుమకొండలో టాస్క్ ఫోర్స్ (Hanumakonda Task Force) పోలీసులు( Police) దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్‌లో పక్కా నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. దాడుల్లో కమలాపూర్ మండలం ఉప్పల్ కు చెందిన అకినెపల్లి వంశీధర్ (32) అనే వ్యాపారి వద్ద నుంచి రూ.10,03,760 విలువైన అనార్, వి1, జే.కే, బాబా బ్లాక్, అంబర్ వంటి పలు రకాల నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన నిందితుడిని అదుపులోకి తీసుకుని నిందితుని వద్ద స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి విచారణ నిమిత్తం సుబేదారి పోలీసులకు అప్పగించారు. ఈ గుట్కా దందాలో ప్రధాన పాత్రధారులుగా ఉన్న మట్టెవాడకు చెందిన కొలారియా ధీరజ్, కరీంనగర్‌కు చెందిన గాజుల అనిల్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్ తెలిపారు. ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్ కె.శ్రీధర్, ఎస్సై టి.వీరస్వామి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Ramchander Rao: ఆప్టికల్ ఫైబర్ సౌకర్యాలు లేక.. ఇబ్బందుల్లో కేబుల్ ఆపరేటర్స్!
నెల్లికుదురులో దారుణం.. బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య
మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) నెల్లికుదురు మండల కేంద్రంలో బంగారం కోసం గుర్తు తెలియని దుండగులు దారుణానికి ఒడిగట్టారు. ఒంటరిగా ఉంటున్న ఈరగాని రాధమ్మ (75) అనే వృద్ధురాలును రాత్రి వేళలో అతి దారుణంగా హత్య చేశారు. స్టానికులు తెలిపిన వివరాల ప్రకారం. రాధమ్మ మెడలోని బంగారు చైన్ కోసం దుండగులు లాగడంతో రాధమ్మ చైన్ వదలకపోవడంతో తలపై గాయపరిచి, ఇంటి ముందు ఉన్న బావిలో తోసేశారు. దుండగులను ప్రతిఘటించి బంగారు గొలుసు కాపాడుకునేందుకు వృద్ధురాలు చివరి వరకు పోరాడి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బావిలోంచి మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ ఐ రమేష్ బాబు తెలిపారు.
Also Read: Biggest Baby: అమెరికాలో మహాబలుడు.. పుట్టుకతోనే కొత్త చరిత్ర.. ఈ బుడ్డోడు మాములోడు కాదు!