Jangaon Protest ( IMAGE CREDIt: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Jangaon Protest: వంతెన నిర్మాణం చేసేదాక మా ఊరు రావోద్దు.. గ్రామ‌స్తుల ఆందోళ‌న‌

Jangaon Protest: జనగామ నుండి హుస్నాబాద్ కు వెళ్ళాలంటే వ‌యా గానుగుప‌హ‌డ్ ఊరు నుంచి వెళ్ళాలి. ఎంత పెద్ద వాహానం అయినా ఆ ఊరునుంచే రాక‌పోక‌లు సాగించాలి. రాక‌పోకలు సాగించే ఆ ఊరు రోడ్డుపై ఒక బ్రిడ్జి ఉంటుంది. అది కూలిపోవ‌డంతో ర‌హ‌దారి లేక వాహ‌న‌దారులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. దీంతో ప్ర‌భుత్వం ఆ బ్రిడ్జి ప‌క్క‌నే తాత్కాలికంగా మ‌ట్టిరోడ్డును నిర్మించింది. గ‌త రెండు రోజుల క్రితం కురిసిన వ‌ర్షాల‌కు అది కాస్త తెగిపోయింది. ఇక గ్రామానికి రాక‌పోక‌లు బంద్ అయ్యాయి.

 Also Read: Do You Wanna Partner: ఆడవారు చేసే పనికి అడ్డుపడే మగవారు.. అసలు ఏం చేశారంటే?

వ‌ర్షాలు త‌గ్గ‌డంతో తిరిగి వాహానాలు రాక‌పోక‌లు సాగిస్తుంటే గానుగుప‌హ‌డ్ గ్రామ‌స్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ బ్రిడ్జిని బాగు చేసేదాకా, కొత్త‌ది క‌ట్టేదాకా వాహనాలు గనుగుపహాడ్ గ్రామం నుండి రానివొద్దు అని గ్రామస్తులు ఆందోళ‌న‌కు దిగారు. గ‌తంలోనూ బ్రిడ్జిని మంజూరు చేయాల‌ని గ్రామ‌స్తులు జ‌న‌గామ క‌లెక్ట‌రెట్ ఎదుట నెల‌ల త‌ర‌బ‌డి రిలే నిర‌హార దీక్ష‌లు చేశారు. దీక్ష‌ల‌కు అధికారులు, ప్ర‌జాప్ర‌తినిదులు దిగిరాలేదు స‌రిక‌దా, గ్రామ‌స్తుల‌కు ఓపిక న‌శించి దీక్ష‌ల‌ను విర‌మించుకున్నారు.

ఆగ్ర‌హించిన గ్రామ‌స్తులు ఆందోళ‌న‌

బ్రిడ్జిని నిర్మించ‌క‌పోవ‌డంతో తాత్కాలిక మ‌ట్టిరోడ్డుపై నుంచే హుస్నాబాద్‌కు వెళ్ళే భారీ వాహానాలు, బస్సులు, ఇత‌ర వాహానాలు వెళుతుండ‌టంతో ఆగ్ర‌హించిన గ్రామ‌స్తులు ఆందోళ‌న‌కు దిగారు. ఆందోళ‌న‌తో వాహ‌నాలు ఎక్క‌డివి అక్క‌డే నిలిచిపోయాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళ‌న‌కారుల‌తో మాట్లాడారు. ఆందోళ‌నకారులు చెప్పినా విన‌క‌పోవ‌డంతో పోలీసులు వారిని అక్క‌డి నుంచి లాగివేశారు. చివ‌రికి పోలీసులు జిల్లా అధికారుల‌తో మాట్లాడి బ్రిడ్జి మంజూరు చేసేందుకు కృషి చేస్తామ‌ని మాటివ్వ‌డంతో ఆందోళ‌న‌ను విర‌మించారు.

 Also Read: Mouli viral video: మౌళి అప్పుడు సరదాగా చేసింది ఇప్పుడు నిజమైంది.. అది ఏంటంటే?

Just In

01

Telangana Govt: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్… మండలానికో సెంట్రింగ్ యూనిట్!

Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్!

CM Revanth Reddy: కృష్ణా నీటి కోటా సాధించటంలో కేసీఆర్ విఫలం… సీఎం సంచలన కామెంట్స్!

Local body Elections: స్థానిక ఎన్నికలపై తెలంగాణ మంత్రుల కీలక నిర్ణయం!

India vs Pak Match: ‘భారత్-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్’ డిమాండ్లపై టీమిండియా ఫీల్డింగ్ కోచ్ స్పందన