Harish Rao: రైతుల యూరియా కష్టాలను చూపిస్తే మీడియా పై కేసులు పెడతారా ? అణిచివేతలు, ఆంక్షలతో జర్నలిస్టులను భయపెడుతారా? అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. రైతులు పడుతున్న యూరియా కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఓ జర్నలిస్టు(Journalist)పై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం అన్నారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టుపై పోలీసులు ఉల్టా కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం అన్నారు.
గడిచిన 2 నెలలుగా రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం..ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్న మీడియాపై కేసులు పెట్టడం శోచనీయం అన్నారు. శాంతిభద్రతల నిర్వహణను పక్కన పెట్టి ప్రజల గొంతునొక్కేందుకు పోలీసులను వాడడం అప్రజాస్వామికం అన్నారు. జర్నలిస్ట్ పై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీ(DGP)ని డిమాండ్ చేశారు.
Also Read: Viral News: కారులోంచి దూకి ప్రియుడు మృతి.. అసలేం జరిగిందో తెలిస్తే షాక్
కఠినంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం
మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై రేవంతు సర్కారు కర్కషంగా, కఠినంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం అని హరీష్ రావు మండిపడ్డారు. మధ్యాహ్న భోజన కార్మికులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు, వేతనాల కోసం కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దారుణం అన్నారు. ఎన్నికల సమయంలో వేతనాలు పెంచుతామని నమ్మించి, ఇప్పుడు నయవంచన చేయడం ద్రోహం చేయడమే అవుతుందన్నారు.
ఉన్నఫలంగా మధ్యాహ్న భోజన పథకం నుంచి దూరం చేస్తే 20 ఏండ్లుగా పని చేస్తున్న కార్మికుల పరిస్థితి ఏం కావాలి? అని ప్రశ్నించారు. ఏడాది కాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి మరీ విద్యార్థులకు భోజనాలు పెట్టిన ఆ చిరు ఉద్యోగుల ఆర్థిక భారం ఎవరు తీర్చాలి? అన్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికుల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: The Girlfriend: అనుకోకుండా ఇంటికి వచ్చిన గర్ల్‌ఫ్రెండ్‌పై.. ఏం జరిగిందంటే?