Crime News (imagecredit:twitter)
క్రైమ్

Crime News: మాయమాటలతో మైనర్ బాలికపై అఘాయిత్యం.. కోర్టు సంచలన తీర్పు..?

Crime News: మైనర్​ బాలికను పెళ్లి చేసుకుని లైంగిక వాంఛలు తీర్చుకున్న యువకునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 15వేల రూపాయల జరిమానా విధిస్తూ రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం గొట్టిగారిపల్లికి చెందిన చైతన్యపురిలో ఉంటున్న కర్నె దినేశ్(Karne Dinesh) ఎలియాస్ (29) మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు. కాగా, దినేశ్​ వేధింపులు రోజురోజుకు అధికమవుతుండటంతో బాధితురాలు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అప్పట్లో చైతన్యపురి స్టేషన్​ సీఐగా ఉన్న బీ.రవికుమార్(CI Ravi Kumar) కేసులు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. కేసును విచారించిన కోర్టు దినేశ్ కు కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అదే సమయంలో బాధితురాలికి 5లక్షల రూపాయలు ఆర్థిక సాయంగా అందించాలని ఆదేశించింది.

మాయ మాటలతో కిడ్నాప్ చేసి..

మాయ మాటలతో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితునికి అత్యాచారం కేసులో పదేళ్లు, కిడ్నాప్​ కేసులో అయిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ రాజేంద్రనగర్(Rajendranagar) లోని పోక్సో యాక్ట్ కేసుల ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపల్లి నేతాజీనగర్​ నివాసి సందీప్ (29) వృత్తిరీత్యా డ్రైవర్​. తాను ఉంటున్న ప్రాంతంలోనే నివాసముంటున్న ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న సందీప్ తరచూ స్కూల్ వద్దకు వెళ్లి కలవటం మొదలు పెట్టాడు. విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులు పాఠశాల మానిపించారు.

Also Read: TGMDC Sand Policy: లారీ యజమానుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్!

బాధితురాలి సోదరుడు ఫిర్యాదు

అయితే, 2020, జనవరి 8న బాలికకు ఫోన్ చేసిన తాను చెప్పిన చోటుకు రావాలని, లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు. దాంతో బాధితురాలు అతని వద్దకు వెళ్లింది. ఆ తరువాత తన బంధువు ఇంటికి చిన్నారిని తీసుకెళ్లిన సందీప్(Sandeep) ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ మేరకు బాధితురాలి సోదరుడు ఫిర్యాదు చేయగా చందానగర్ సీఐ బీ.రవీందర్ కేసులు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన కోర్టు నిందితుడైన సందీప్ కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. బాధితురాలికి 3లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందచేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read: OTT review: ఆఫీస్‌లో కొత్త బాస్ మాజీ లవర్ అయితే.. పాపం వాడి పరిస్థితి ఏంటంటే?

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ