BRS vs Congress: ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్(BRS) పార్టీలోనే ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై గెలిచి కాంగ్రెస్ కు వెళ్లిన ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చారు. ఆ వివరణ పత్రాలను బీఆర్ఎస్ పార్టీ నుంచి కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్(KP Vivekananda Goud), కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)కి స్పీకర్ పంపారు. ఈ నెల 14లోగా రిప్లై ఇవ్వాలని స్పీకర్ సూచించారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణ కాపీలపై బీఆర్ఎస్ న్యాయవాదులతో కసరత్తు చేస్తున్నారు. ఎలా ముందుకెళ్లాలనేదానిపై న్యాయ నిపుణుల సలహాలు సైతం తీసుకుంటున్నారు.
స్పీకర్ దగ్గర సంతృప్తి చెందక పోతే
ప్రస్తుతం స్పీకర్ బెంగుళూరులో జరుగుతున్న 11వ కామన్వెల్త్ పార్లమెంట్ అసిసియేషన్ ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ నెల 14వరకు కాన్ఫరెన్స్ కొనసాగనున్నది. అయితే స్పీకర్ వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పడు హాట్ టాపిక్ అయింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణకు స్పీకర్ సంతృప్తి చెందుతారా? లేదా? అనేది కూడా చర్చమొదలైంది. వ్యక్తిగతంగా ఫిరాయింపులు ఎమ్మెల్యేలు హాజరు అయి వివరణ ఇవ్వాలని కోరతారా? అనేది కూడా చర్చకు దారితీసింది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కూడా స్పీకర్ కోర్టులో విచారించనున్నారు. అందుకు న్యాయవాదులు వాదనాలు వినిపించేందుకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ మరోసారి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎన్నికల్లో చేసిన ప్రచారం, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో పాటు కాంగ్రెస్(Congresss) సమావేశాల్లో పాల్గొన్న ఫొటోలు, కండువాలు కప్పిన పొటోలను, తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలకు వీడియోలను సేకరిస్తున్నారు. స్పీకర్ ముందు మరోసారి ఉంచాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఒక వేళ స్పీకర్ దగ్గర సంతృప్తి చెందక పోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. స్పీకర్ విచారణ షెడ్యూల్ ఇంకా రాలేదని, వచ్చిన వెంటనే వాదనలు వినిపిస్తామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటుపడేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Also Read: Kavitha: కవిత రాజీనామా పెండింగ్?.. ఆమోదం ఎప్పుడంటే?
విమర్శలకు పదునుపెట్టిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ విమర్శలకు పదును పెట్టింది. ఫిరాయింపులు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ కు సమాధానంలో చెప్పడం సిగ్గుచేటని విమర్శలు గుప్పించారు. రేవంత్(Revanth) ను కలిసింది కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటే ప్రజలు నమ్ముతారా..? రేవంత్ కప్పింది పార్టీ జెండా కాదు.. జాతీయ జెండా అని చెప్పడం హాస్యాస్పదం అని మండిపడుతున్నారు. జాతీయ జెండాను అవహేళన చేయడం సరికాదని, దొంగతనం చేసి తప్పించుకోలేని స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇప్పటికే పార్టీ విశ్వాసం కోల్పోయారన్నారు. నమ్మిన పార్టీకి, ప్రజలకు ద్రోహం చేసిన ఎమ్మెల్యేలను ప్రజలు క్షమించరు.. కోట్లాది మంది ప్రజలకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాళ్ళను డిస్కాలిఫై చేయడం ఖాయం ఖాయమని, పార్టీ మారిన 10 సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు రావడం.. ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ రికార్డులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే
బీఆర్ఎస్(BRS) పార్టీ బీఫాంపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్(Congress) లో చేరారు. దాదాపు ఏడాదిన్నర అవుతున్నా అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గానే ఉన్నారు. అసెంబ్లీ బయట కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతూ.. అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు సైతం పలు సందర్భాల్లో 38మంది ఎమ్మెల్యేలు ఉన్నా సంఖ్యకు అనుగుణంగా మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని అసెంబ్లీలో కోరుతున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లోనూ తమ సంఖ్య 38 మంది అని అందుకు తగిన విధంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అంతేకాదు గన్ పార్కు వద్ద నిరసన చేపట్టిన సందర్భంలోనూ ఇదే వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటిని స్పీకర్ పరిగణలోకి తీసుకుంటారా? కేవలం ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరణపైనే విచారణ చేస్తారా అనేది చూడాలి.
Also Read: Konda Surekha: ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బీసీ బహిరంగ సభ!