Manchu Manoj: ‘మిరాయ్’ సక్సెస్‌తో ఆ చిత్ర టీమ్ అంతా సంతోషంలో మునిగిపోయింది. సెప్టెంబర్ 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో టీమ్ అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ క్రమంలో మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మంచు మనోజ్ తన మదర్ నుంచి ఆశీస్సులు తీసుకుంటున్నారు. కొన్నాళ్లుగా వారి ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు చోటు చేసుకున్నాయో తెలియంది కాదు. కానీ, ఇప్పుడన్నీ సర్దుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో అన్నట్లుగా, మనోజ్ షేర్ చేసిన వీడియో ఉంది.
అమ్మ ఆశీస్సులు
ఈ వీడియోలో సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్పిన మనోజ్.. ఈ సక్సెస్‌తో అమ్మ చాలా హ్యాపీగా ఉందని చెబుతూ.. వాళ్ల అమ్మ కాళ్లకు నమస్కారం చేశారు. వెంటనే ఆయన భార్య మౌనిక కూడా ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి ఇంటి ముందు సరదాగా డ్యాన్స్‌లు చేశారు. అనంతరం తన అనుచరుల సమక్షంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమాను సక్సెస్‌తో చాలా ఆనందంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండటమే కాకుండా.. వాళ్లింట్లో గొడవలు కూడా చాలా వరకు క్లియర్ అయ్యాయనే విషయాన్ని తెలియజేస్తుండటం విశేషం.
Also Read- Bigg Boss Buzzz: బిగ్ బాస్ బటర్ ఫ్లై ఎఫెక్ట్.. ఈసారి శివాజీ రచ్చ రచ్చే!
మంచు ఫ్యామిలీకి మంచి రోజులు
ఆ మధ్య వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నప్పుడు మంచు మోహన్ బాబు ఓ లెటర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ లెటర్‌లో మనోజ్‌పై వాళ్ల అమ్మ కూడా సీరియస్‌గా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదనేది అర్థమవుతోంది. మనోజ్ వాళ్ల అమ్మ చాలా హ్యాపీగా ఇందులో కనిపిస్తున్నారు. మనోజ్ కూడా మొదటి నుంచి వాళ్ల అమ్మానాన్నలను ఒక్క మాట కూడా అనలేదు. ముఖ్యంగా మోహన్ బాబు అంటే తనకి ఎంత ఇష్టమో, ఎంత ప్రాణమో చెబుతూనే ఉన్నారు. గొడవలకు కారణం ఎవరో కూడా ఆయన చెబుతూనే వచ్చారు. కానీ ఈ మధ్య మనోజ్‌లో కూడా బీభత్సమైన మార్పు కనిపిస్తుంది. అన్న నటించిన ‘కన్నప్ప’ సినిమా విడుదలైనప్పుడు సినిమాపై పాజిటివ్‌గా మాట్లాడారు. అన్న కొడుక్కి అవార్డు వస్తే, తనకి వచ్చినట్లుగానే ఎంత గొప్పగా ఫీలయ్యాడు. అలాగే మంచు విష్ణు కూడా మనోజ్ పేరు ప్రస్తావించలేదు కానీ, ‘మిరాయ్’ సినిమా విడుదల సందర్భంగా టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో మంచు ఫ్యామిలీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయనేలా ఇండస్ట్రీలోని వారంతా మాట్లాడుకుంటున్నారు.
Also Read- Pawan Kalyan: కళలు లేని సమాజంలో హింస ప్రబలే అవకాశం ఉంది.. పవన్ సంచలన నిర్ణయం
నెగిటివ్ రోల్..
‘మిరాయ్’ విషయానికి వస్తే.. సూపర్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన పాన్ ఇండియా విజువల్ వండర్ చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు నెగిటివ్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు.
My mom was the proudest 🙏🏼❤️ Thank u all for making this happen ♥️ Celebrating it with my dearest ones around me makes it even more memorable 🙌🏼
My heartfelt thanks to each and every movie lover for the immense love 🙏🏻#Mirai #BlackSword pic.twitter.com/eJYQIWr7MU
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 12, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు