GHMC
తెలంగాణ

GHMC: మానవత్వం లేదా? కమిషనర్ స్పందించినా, డిప్యూటీ కమిషనర్ స్పందించరా?

GHMC: దేవుడు వరమిచ్చినా, పూజారి కనికరించని విధంగా తయారైంది జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి. కొద్ది రోజలు క్రితం నగరంలో జరిగిన గణేశ్ నిమజ్జనోత్సవంలో బషీర్ బాగ్ రోడ్డులో స్వీపింగ్ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు టస్కర్ కింద పడి చనిపోయిన కార్మికురాలు రేణుక మృతి సమాచారాన్ని తెల్సుకుని అప్పటికప్పుడు హాస్పిటల్‌కు వచ్చి, తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేయటంతో రేణుక పార్థివ దేహానికి నివాళులర్పించటంతో పాటు అప్పటి వరకు కార్మికులు చనిపోతే చెల్లిస్తున్న మట్టి ఖర్చులను రూ. 10 వేలకు బదులుగా రూ. 2 లక్షలను చెల్లించి కమిషనర్ తన ఉదార స్వభాన్ని చాటుకోగా, సర్కిల్లకు బాస్‌లుగా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కమిషనర్లకు కార్మికులంటే ఏ మాత్రం లెక్కలేదన్న విషయం తేలిపోయింది.

Also Read- Disha Patani: ఇంటి ముందు కాల్పులు.. షాక్‌లో దిశా పటానీ.. విషయం ఏమిటంటే?

స్వీపింగ్ విధులు నిర్వహిస్తూ మృతి

శేరి లింగంపల్లి జోన్ పరిధిలోకి వచ్చే వార్డు నెం. 103లోని యూసుఫ్ గూడ సర్కిల్ పరిధిలో గత నెల 20వ తేదీన సామ పార్వతమ్మ అనే కార్మికురాలు బోరబండ ఏరియాలో స్వీపింగ్ విధులు నిర్వహిస్తుండగా, వెనక నుంచి వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టడంతో కొంత దూరం ఎగిరి పడిన ఆమె తీవ్ర గాయాలపాలైంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం మృతి చెందింది. కార్మికురాలు రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయంపై డిప్యూటీ కమిషనర్ కనీసం ఉన్నతాధికారులకు కూడా సమాచారమివ్వలేదు. చికిత్స పొందుతూ పార్వతమ్మ శుక్రవారం మృతి చెందగా, కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఆమె కుటుంబానికి ఆర్థిక స్తోమత లేకపోవటంతో శానిటరీ జవాన్ చందు.. ఇతర కార్మికుల వద్ద చందాలు వసూలు చేసి, మొత్తం రూ. 30 వేలను పోగు చేసి, శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిసింది.

మానవత్వం మాయమైపోతుంది

తెల్లవారే కల్లా మహానగరంలోని రోడ్లను శుభ్రపరిచి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు శ్రమిస్తున్న శానిటేషన్ కార్మికురాలు రోడ్డు ప్రమాదానికి గురైనా, కనీసం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ స్పందించకపోవటం మానవత్వం మాయమైపోతుందనేందుకు నిలువెత్తు నిదర్శనం. నిమజ్జనం విధుల్లో బిజీగా ఉన్న కమిషనర్ కర్ణన్ స్వీపర్ రేణుక మృతి సమాచారం తెలియగానే హుటాహుటీగా హాస్పిటల్ కు వచ్చి, నివాళులర్పించగా, యూసుఫ్ గూడ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ తన పరిధిలో పని చేస్తున్న కార్మికురాలు పార్వతమ్మను హాస్పిటల్ లో ఒక్కసారి పరామర్శించకపోగా, కనీసం ఉన్నతాధికారులకు సమాచారం కూడా అందించకపోవటం పారిశుద్ధ్య కార్మికులపై అధికారుల నిరాదరణకు నిదర్శనం.

Also Read- Little Hearts: బన్నీ నుంచి చైతూ వరకూ.. ‘లిటిల్ హార్ట్స్’ అందులోనూ టాప్ ప్లేసే!

హుటాహుటీన చేరుకున్న బీఎంఎస్ నేతలు

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ కార్మికురాలు పార్వతమ్మ మృతి చెందిన సమాచారం తెల్సుకున్న భారతీయ మజ్దూర్ సంఘ్ గుర్తింపు పొందిన భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ టి. కృష్ణ నేతృత్వంలో నేతలు పార్వతమ్మ నివాసానికి చేరుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం వారు జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసి విషయాన్ని తెలియజేశారు. అప్పటికప్పుడే స్పందించిన కమిషనర్ వెంటనే పార్వతమ్మ కుటుంబానికి రూ. 2 లక్షలను అందజేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Manchu Manoj: ‘మిరాయ్’ సక్సెస్‌తో మా అమ్మ గర్వపడుతోంది.. వీడియో వైరల్!

Bigg Boss Buzzz: బిగ్ బాస్ బటర్ ఫ్లై ఎఫెక్ట్.. ఈసారి శివాజీ రచ్చ రచ్చే!

GHMC: మానవత్వం లేదా? కమిషనర్ స్పందించినా, డిప్యూటీ కమిషనర్ స్పందించరా?

CM Revanth Reddy: 21న సిటీలో సీఎం టూర్.. పలు అభివృద్ది పనులు ప్రారంభం!

Disha Patani: ఇంటి ముందు కాల్పులు.. షాక్‌లో దిశా పటానీ.. విషయం ఏమిటంటే?