Dasoju Sravan: గ్రూప్1 పరీక్షలను తప్పనిసరిగా రద్దు చేయాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం దయచేసి రిట్ అప్పీల్ చేయవద్దు అని ఎమ్మెల్సీ దాసోజు (Dasoju Sravan) శ్రవణ్ కోరారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ క్లబ్ కు వచ్చి హైకోర్టు జడ్జిమెంట్ పై చర్చించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి మానవత్వం ఉంటే హైకోర్టు జడ్జిమెంట్ చదవాలని అన్నారు. గ్రూప్1 పరీక్షల వ్యవహారంపై జ్యూడీషియరీ విచారణ జరగాలన్నారు.
Also Read: Konda Surekha: అటవీ అమరవీరులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. మంత్రి కొండా సురేఖ స్పష్టం
గ్రూప్1 వ్యవహారంపై ప్రత్యేక అసెంబ్లీ పెట్టాలి
రాజ్యాంగబద్ధమైన సంస్థ నేతృత్వంలో ఘోరమైన తప్పిదం జరిగిందన్నారు. లాయర్లను పట్టుకుని వచ్చి విద్యార్థుల గొంతును కోయవద్దని విజ్ఞప్తి చేశారు. జీవో 29ను రద్దు చేయాలని, గ్రూప్1 పరీక్షను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులు విత్ డ్రా చేయాలని కోరారు. గ్రూప్1 వ్యవహారంపై ప్రత్యేక అసెంబ్లీ పెట్టాలని డిమాండ్ చేశారు. గ్రూప్1 జడ్జిమెంట్ పై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. బీజేపీ నేతల నోటికి తాళాలు వేసుకున్నారా? అని నిలదీశారు. బండి సంజయ్.. కాగ్రెస్ ప్రభుత్వం కాపాడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ,బీ ఆర్ ఎస్ వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు ,కడారి స్వామి యాదవ్ ,కొడంగల్ బీ ఆర్ ఎస్ నేత మహిపాల్ పాల్గొన్నారు.
Also Read: Khammam District: చేసేది ప్రభుత్వ ఉద్యోగం.. కానీ సెటిల్మెంట్ లక్ష్యం.. ఇంతకీ ఎవరు..?