Srinivas Goud రాష్ట్రంలో ఖాళీ గా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivass Goud) డిమాండ్ చేశారు. ప్రజా పాలన అంటే పోలీసులతో అరెస్టులు చేయించడమా? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో మహబూబ్ నగర్ జిల్లా హాన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రూపు-1 అవకతవకల పై వెంటనే సీబీఐ(CBI) దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్(KCR) ఇచ్చిన నోటిఫికెషన్ల కే ఈ ప్రభుత్వం ఉద్యోగాలిచ్చిందని, అబద్దాలు చెబుతూ కాంగ్రెస్ నేతలు కాలక్షేపం చేస్తుందని మండిపడ్డారు.
చేతివృత్తులకు కనీస గౌరవం
ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ పై మాట తప్పారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) ను కాంగ్రెస్ ప్రకటించిందని, ఏటా 20వేల కోట్లు పెడతామని హామీ ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ చేసే చివరి మోసం అన్నారు. ప్రభుత్వంలో చేతివృత్తులకు కనీస గౌరవం లేదన్నారు. అమలు కాని వాటికి జీఓ ఇచ్చి చేతులుదులుపుకోవాలని కాంగ్రెస్ చూస్తుందని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లతోనే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవుల్లో, కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
Also Read: GHMC: ట్యాక్స్ చెల్లింపులో అక్రమాలకు చెక్.. భారీగా పెరగనున్న జీహెచ్ఎంసీ ఆదాయం!
రాష్ట్ర వ్యాప్తంగా డిస్ ప్లే
కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర వ్యాప్తంగా డిస్ ప్లే చేస్తామని వెల్లడించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, నాయకులు కొండా లక్ష్మయ్య, బాలరాజు, నెత్తికొప్పుల శ్రీను, నాగయ్య, జంబులయ్య, యాదయ్య, మాదవులు గౌడ్, దాసరి రాములు తదితరులు ఉన్నారు. చేరినవారిలో మాజీ ఎంపీటీసీ పెంటయ్య, మాజీ ఉపసర్పంచ్ గంగాపురి, వెంకటయ్య, రంగారెడ్డిపల్లి లక్ష్మయ్య, కురుమగడ్డ వెంకటయ్య, ఎం. గోవర్ధన్ గౌడ్, అక్కపల్లి చెన్నయ్య, తదితరులు ఉన్నారు.
Also Read: Samantha: ఇప్పుడన్ని వదిలేసా.. సంతోషంగా ఉన్నా.. సమంత సంచలన కామెంట్స్