SIM Box Scam (imagecredit:twitter)
తెలంగాణ

SIM Box Scam: సిమ్​ బాక్స్ వ్యవస్థతో నయా మోసం.. ఎలా చేశారో తెలిస్తే షాక్ కావాల్సిదే..?

SIM Box Scam: సిమ్​ బాక్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఇంటర్నేషనల్​ ఫోన్ కాల్స్International phone calls) ను లోకల్​ కాల్స్(Local Cals)​ గా మారుస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ముగ్గురిని తెలంగాణ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక సిమ్​ బాక్స్ తోపాటు 200 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్(Shikha Goyal) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. టెలీకాం శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఛక్షు పోర్టల్ ద్వారా ఇటీవల ఓ ఫిర్యాదు అందింది. కొందరు సైబర్ క్రిమినల్స్ తప్పుడు ఫోన్​ కాల్స్ చేస్తూ మోసాలు చేస్తున్నట్టుగా ఫిర్యాదీ తెలిపాడు.

అనుమానిత నెంబర్ల కాల్..

ఈ సమాచారాన్ని టెలీకాం శాఖ అధికారులు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు అందించారు. ఈ క్రమంలో కేసులు నమోదు చేసి డీఎస్పీలు కే.వీ.ఎం.ప్రసాద్, సూర్యప్రకాశ్​, సీఐలు రమేశ్​, శ్రీను నాయక్, డీ.శ్రీనుతోపాటు ఎస్ఐ రాము నాయక్ తో కలిసి విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా అనుమానిత నెంబర్ల కాల్ డేటాను సేకరించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరపి చాంద్రాయణగుట్ట ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న సిమ్​ బాక్స్ గుట్టును రట్టు చేశారు. ఈ క్రమంలో హఫీజ్​ బాబానగర్​ కు చెందిన హిదాయతుల్లా (28), సిమ్​ కార్డుల విక్రేతలు అహద్ ఖాన్​ (25), షేక్ షోయల్ (24)లను అరెస్ట్ చేశారు.

Also Read: Crime News: డ్రగ్స్​ దందాలో హవాలా వ్యాపారులు.. చిట్టా విప్పిన ఈగల్ టీమ్!

కొంప ముంచిన స్నాప్ చాట్ పరిచయం..

నిరుద్యోగిగా ఉన్న హిదాయతుల్లా(Hidayatullah)కు కొంతకాలం క్రితం స్నాప్ చాట్(Snapchat) ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ తరువాత ఇద్దరూ వాట్సాప్​ లో తరచూ మట్లాడుకోవటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో అతను చెప్పిన మేరకు కార్ల వ్యాపారం ప్రారంభించిన హిదాయతుల్లా భారీగా నష్టపోయి ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నాడు. ఇదే విసయాన్ని గచ్చిబౌలిలోని ఓ పబ్ లో స్నేహితునికి చెప్పాడు. సదరు ఇచ్చిన స్నేహితుడి సలహాతో ఓ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ లో చేరి మరో 16లక్షలు నష్టపోయాడు. ఆ తరువాత అదే స్నేహితుడు హిదాయతుల్లాకు హాంకాంగ్ కు చెందిన వెనిస్సా అనే మహిళను పరిచయం చేశాడు. యూకే నెంబర్​ ద్వారా హిదాయతుల్లాతో వాట్సాప్​ లో మాట్లాడిన వెనిస్సా తాను చెప్పినట్టుగా చేస్తే పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందటమే కాకుండా మరింత సంపాదించ వచ్చని చెప్పింది.

బాక్స్​ లో సిమ్​ కార్డులు

దీనికి హిదాయతుల్లా అంగీకరించాడు. ఈ క్రమంలో వెనిస్సా ఫిబ్రవరిలో సిమ్ బాక్స్ ను కొరియర్ ద్వారా హిదాయతుల్లాకు పంపించింది. ఆ తరువాత వాట్సాప్​ వీడియో కాల్(WhatsApp video call) చేసి సూచనలు ఇస్తూ దానిని ఇన్​ స్టాల్ చేయించింది. అనంతరం ఆ బాక్స్​ లో సిమ్​ కార్డులు అమర్చాలని చెప్పింది. ఈ మేరకు హిదాయతుల్లా తన స్నేహితులైన అహద్ ఖాన్, షోయబ్ ల నుంచి ఇతరుల పేర 500 సిమ్​ కార్డులు తీసుకున్నాడు. వాటిని సిమ్​ బాక్స్ లో అమర్చాడు. ఆ తరువాత అంతర్జాతీయ ఫోన్ కాల్స్​ ను లోకల్​ కాల్స్​ గా మారుస్తూ అక్రమార్జనలకు తెర లేపాడు. ఈ ముఠా సాగిస్తున్న అక్రమాలకు చెక్​ పెట్టిన సైబర్​ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ముగ్గురు నిందితులపై ఐటీ యాక్ట్ సెక్షన్​ 66సీ, 66డీతోపాటు బీఎన్​ఎస్​ సెక్షన్​ 318(4), 319(2), టెలి కమ్యూనికేషన్స్​ యాక్ట్ సెక్షన్ 42(1), 42(3) ప్రకారం కేసులు నమోదు చేశారు.

Also Read: YS Sharmila: నా బిడ్డ రాజకీయాల్లోకి వస్తే.. వైసీపీకి ఎందుకంత ఉలికిపాటు.. వైఎస్ షర్మిల

Just In

01

Shocking Incident: పాతబస్తీలో దారుణం.. మ్యాన్ హోల్‌లో పడిపోయిన ఐదేళ్ల చిన్నారి.. చివరికి..?

Jogulamba Gadwal: గద్వాల జిల్లాలో దారుణం.. ప్రైవేట్ స్కూల్ వ్యాన్ బోల్తా

Prabhas movie update: ‘రాజాసాబ్’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి

Hyderabad Metro: మెట్రో నడపడం మా వల్ల కాదు.. ఆదాయం సరిపోవట్లేదు.. కేంద్రానికి ఎల్&టీ లేఖ

TGMDC Sand Policy: లారీ యజమానుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్!