Viral Video (Image Source: Instagram)
Viral

Viral Video: బాత్రూం ఖాళీగా లేదా? ఈ పని చేయడానికి మెట్రోనే దొరికిందా!

Viral Video: ఇటీవల కాలంలో మెట్రో రైళ్లు.. ప్రయాణానికే కాకుండా విచిత్ర ఘటనలకు వేదికగా మారుతున్నాయి. తాజాగా న్యూయార్క్ సిటీ మెట్రో రైల్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక యువతి రైల్లో కూర్చొని తన పాదం కింద ఉన్న డెడ్ స్కిన్ ను తొలగిస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాన్ని తోటి ప్రయాణికుడు తన కెమెరా బంధించిగా అది నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

Also Read: Viral Video: బస్సులో రణరంగం.. డ్రైవర్‌ను ఎగిరెగిరి కొట్టిన మహిళ.. అందరూ షాక్!

యువతి డెడ్ స్కిన్ ను తొలగిస్తున్న దృశ్యాలను ఓ వ్యక్తి తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. అందులో యువతి తన అరికాలుకు ఉన్న చర్మాన్ని రప్పా రప్పా తొలగిస్తూ కనిపించింది. అయితే ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. సదరు యూజర్ ఆసక్తికర క్యాప్షన్ పెట్టారు. ‘న్యూయార్క్ సబ్‌వే ఎప్పుడూ నిరాశపరచదు. ప్రజలు వింతగా ప్రవర్తించడం చూస్తూనే ఉంటాం. కానీ చీజ్ ను వంటకాలపై చిందించినట్లు.. కాలు డెడ్ స్కిన్ ను అలా తొలగించడం.. కొత్తరకం’ అంటూ ఫన్ ఎమోజీని షేర్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Luis Monteiro (@1776qqqqq)

Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఒక్క ఫోన్‌తో మీ సమస్యలకు చెక్!

వీడియో వైరల్ అయిన వెంటనే నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘ఇందుకే పబ్లిక్ షేమింగ్ అవసరం’ అని ఒకరు రాశారు. మరొకరు సరదాగా స్పందిస్తూ.. ‘డెడ్ స్కిన్ సేకరించి క్రైమ్ సీన్లలో చల్లుతాను’ అన్నారు. ‘మెట్రోలో అలా చేయడం నిజంగా పిచ్చితనమే’ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. ‘అసహ్యం… చాలా ఘోరం’ అని మరొకరు అన్నారు. పక్కన ఉన్న వారు ఏమాత్రం స్పందించకపోవడం దురదృష్టకరం అంటూ ఇంకొక నెటిజన్ పేర్కొన్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ పలువురు పట్టుబట్టారు.

Also Read: CM Revanth Reddy: గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాల్లోనే కొత్త రైల్వే లైన్లు.. సీఎం రేవంత్ వెల్లడి

Just In

01

DOST Admissions: ‘దోస్త్’ స్పాట్ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కీలక అప్‌డేట్

Gadwal Court: గద్వాల కోర్టు వినూత్న తీర్పు.. జిల్లాలో ఇదే తొలిసారి

Coolie Monica Song: జుమ్ జుమ్ జుమ్‌తాక్.. ‘కూలీ’ మోనికా వీడియో సాంగ్ వచ్చేసిందోచ్..

Kavitha Politics: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటు చీల్చేందుకు కవిత మాస్టర్ ప్లాన్?

Chai Waala: ‘చాయ్ వాలా’ ‘సఖిరే..’ని చూశారా.. మెలోడీ అదిరింది