The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలియంది కాదు. కానీ ఆ ప్రేక్షకుల ఎదురు చూపులను మరింత పెంచేలా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో క్లారిటీ లేదు. ఈ నేపధ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. ఈ సినిమా రిలీజ్ డేట్‌తో పాటు మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం రాబోయే సంక్రాంతికి ‘రాజా సాబ్’ సందడి షురూ అనేలా క్లారిటీ వచ్చేసింది. అభిమానులు కూడా ఈ సినిమాను సంక్రాంతి బరిలోనే రిలీజ్ చేయాలనేలా కోరుకుంటున్న నేపథ్యంలో.. ఆయన నోటి వెంట కూడా అదే రావడంతో వాళ్లంతా హ్యాపీగా ఉన్నారు.
Also Read- Mee Seva: మీ సేవ పరిధిలోకి కొత్త విధానం.. ఈ సర్టిఫికెట్ జారీ చేయడంలో మరింత సులభతరం
‘కాంతార 2’తో ‘ది రాజా సాబ్’ ట్రైలర్
‘ది రాజా సాబ్’ గురించి నిర్మాత మాట్లాడుతూ ‘కాంతార చాప్టర్ 1’ సినిమా పేరు కూడా తెచ్చారు. అంతే, ‘రాజా సాబ్’కు, ‘కాంతార 2’కు ఉన్న లింకేంటి అని అంతా అనుకుంటూ ఉండటం విశేషం. అసలు విషయం, ఆయన చెప్పిన విషయం ఏంటంటే.. ‘కాంతార 2’ సినిమాకు పోటీగా ఏం ఈ సినిమా రావడం లేదు. ‘కాంతార 2’ థియేటర్లలోకి వచ్చే రోజు.. చిత్ర ట్రైలర్‌ను కూడా వదులుతున్నామని అన్నారు. ‘కాంతార 2’ చిత్రం అక్టోబర్ 2న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అదే రోజు ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ ట్రైలర్ కూడా రాబోతుందన్నమాట. అలాగే చిత్ర విడుదల తేదీ గురించి మాట్లాడుతూ.. ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. ఈ విశేషాలతో పాటు మరో విషయం కూడా చెప్పారు. అదేంటంటే..
Also Read- OG Movie: రికార్డ్స్ రాకుండా చేస్తున్నారంటూ.. ‘ఓజీ’ అమెరికా డిస్ట్రిబ్యూటర్లపై ఫ్యాన్స్ ఆగ్రహం!
ప్రభాస్ బర్త్‌డేకి సాంగ్
సినిమా ఎలాగూ వాయిదా పడింది కాబట్టి.. అభిమానులను ఉత్సాహ పరచడానికి అక్టోబర్‌లో రెండు ట్రీట్స్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్లుగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు. ఒక ట్రీట్ ట్రైలర్ కాగా, రెండోది ప్రభాస్ బర్త్‌డేని పురస్కరించుకుని చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇవే నిర్మాత చెప్పిన ‘ది రాజా సాబ్’ మూవీ విశేషాలు. ఈ అప్డేట్స్‌తో ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. అంతేకాదు, చెప్పిన డేట్‌కి విడుదల చేసేలా చూడాలని, మళ్లీ వీటిని కూడా వాయిదా వేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని నిర్మాతకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ అప్డేట్స్‌తో ‘ది రాజా సాబ్’ ట్యాగ్ మళ్లీ ట్రెండింగ్‌లో టాప్‌లోకి వచ్చింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు