Mega Little Prince: మెగా లిటిల్ ప్రిన్స్‌.. రామ్ చరణ్, నిహారిక పోస్ట్‌లు వైరల్..!
Mega Little Prince
ఎంటర్‌టైన్‌మెంట్

Mega Little Prince: మెగా లిటిల్ ప్రిన్స్‌.. రామ్ చరణ్, నిహారిక పోస్ట్‌లు వైరల్..!

Mega Little Prince: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. బుధవారం లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు (Mega Little Prince) జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా షూటింగ్ మధ్య గ్యాప్‌లో వచ్చి, మెగా వారసుడిని చూసి, ఆశీస్సులు అందించి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా సోషల్ మీడియా వేదికగా మెగా లిటిల్ వన్ అని చెప్పి బిడ్డతో ఉన్న ఫొటోని షేర్ చేశారు. ఇక నాగబాబు అయితే తన ఇంటిలోకి సింబా వచ్చాడని, గుసగుసలాగే గర్జనతోనే తన హృదయంలోకి వచ్చినట్లుగా పోస్ట్ చేసి, తన ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే నిహారిక, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.

Also Read- OG Movie: రికార్డ్స్ రాకుండా చేస్తున్నారంటూ.. ‘ఓజీ’ అమెరికా డిస్ట్రిబ్యూటర్లపై ఫ్యాన్స్ ఆగ్రహం!

ఈ సందర్భంగా రామ్ చరణ్ తన ఎక్స్ పోస్టర్‌లో ‘‘డియర్ వరుణ్, లావణ్య.. మీ ముద్దుల చిన్నారికి నా హృదయపూర్వక అభినందనలు. మీరిద్దరూ ఈ అద్భుతమైన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ బిడ్డ మీకు, మన కుటుంబానికి అపారమైన ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడు మిమ్మల్ని ముగ్గురినీ దీవించుగాక’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక నిహారిక తన పోస్ట్‌లో.. ‘‘ప్రియమైన స్నేహితుడికి స్వాగతం10.09.25..
చిన్ని చేతులు నా గుండెలో పెద్ద భాగాన్ని పట్టుకున్నాయి’’ అని తన సంతోషాన్ని తెలిపింది.

Also Read- Nayanthara: ఐదు కోట్ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సిందే.. నయనతారకు కొత్త చిక్కులు!

లిటిల్ సింహానికి స్వాగతం

తాజాగా మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా తన ఇంట్లోకి నూతనంగా వచ్చిన వారసుడిని కలుపుకుని మొత్తం ఫ్యామిలీ ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసి లిటిల్ సింబాకు స్వాగతం అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో మెగా డాటర్ నిహారిక కూడా ఉన్నారు. వరుణ్ తేజ్, లావణ్య, లిటిల్ ప్రిన్స్, నాగబాబు, పద్మజ, నిహారిక.. ఇలా వారి కుటుంబ పిక్‌ని షేర్ చేసిన నాగబాబు (Mega Brother Nagababu).. తన ఆనందాన్ని తెలియజేశారు. ‘‘నా ప్రియమైన బుజ్జి తండ్రి.. ఎంతో సున్నితంగా, నిశ్శబ్దంగా, అంతులేని ఆశలతో నువ్వు మంచు బిందువులా వచ్చావు. నీ కళ్ళలో, మా కుటుంబ భవిష్యత్ సూర్యోదయాన్ని చూస్తున్నాను. నా లిటిల్ సింహానికి స్వాగతం. నీ గర్జనతో నా హృదయంలోకి గుసగుసలాడుతూ వచ్చావు, నీతో పాటు, నీ చేయి పట్టుకొని నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను..’’ అంటూ నాగబాబు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూస్తుంటే ఆయన పట్టలేనంత సంతోషంలో ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఈ పోస్ట్‌కు నెటిజన్లు కూడా చాలా పాజిటివ్‌కు స్పందిస్తూ.. లిటిల్ ప్రిన్స్‌కు స్వాగతం పలుకుతున్నారు.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..