Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతారకు మరోసారి కష్టాలు మొదలయ్యాయి. ఏ నిమిషాన ఆమె తన పెళ్లి డాక్యుమెంటరీ (Nayanthara Wedding Documentary)ని నెట్‌ఫ్లిక్స్‌కు ఇచ్చిందో, అప్పటి నుంచి ఆమె వరస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవల నయనతారపై ధనుష్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి చిక్కుల్లో నయనతార చిక్కుకుంది. అప్పుడు ధనుష్ రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తే.. ఇప్పుడు రూ. 5 కోట్లు చెల్లించాల్సిందేనంటూ మరో మూవీ నిర్మాణ సంస్థ ఏపీ ఇంటర్నేషనల్.. మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను నయనతార 2022లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారి పెళ్లికి సంబంధించిన వీడియోను ‘ది ఫెయిరీ టేల్’ (The Fairy Tale) పేరుతో డాక్యుమెంటరీగా చేయగా, ఆ డాక్యుమెంటరీ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకుంది. అప్పటి నుంచే వివాదాలు మొదలయ్యాయి.
Also Read- Nagababu: మెగా లిటిల్ ప్రిన్స్‌పై మెగా బ్రదర్ రియాక్షన్ ఇదే.. పట్టలేనంత ఆనందంలో!
కోర్టుకు ‘చంద్రముఖి’ నిర్మాతలు
ఈ డాక్యుమెంటరీ విడుదల తర్వాత నయనతార (Nayanthara)కు లీగల్ చిక్కులు ఎదురవుతూ వస్తున్నాయి. ఇందులో తను నటించిన సినిమాల్లోని విజువల్స్ ఉండటంతో, ఆ సినిమాల నిర్మాతలు ఎదురు తిరుగుతున్నారు. తమ అనుమతి లేకుండా ఎలా వాటిని వాడుకుంటారంటూ కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇంతకు ముందు ధనుష్, ఇలానే కోర్టుకు వెళ్లితే.. ఇప్పుడు నయనతార నటించిన ‘చంద్రముఖి’ చిత్ర నిర్మాతలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో అనుమతి లేకుండా ‘చంద్రముఖి’ (Chandramukhi) విజువల్స్ వాడారని, అందుకుగానూ నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందేనంటూ ఏపీ ఇంటర్నేషనల్ బ్యానర్ నిర్మాత కోర్టును ఆశ్రయించారు. ఏపీ ఇంటర్నేషనల్ బ్యానర్ పిటిషన్‌ను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు, నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్ సంస్థకు నోటీసులు జారీ చేయడమే కాకుండా.. అక్టోబర్ 6 లోపు, దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. దీంతో మరోసారి నయనతార చిక్కుల్లో పడినట్లయింది.
Also Read- Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ నామినేషన్సే ఇంత వైలెంట్‌గా ఉన్నాయేంట్రా బాబు..?
రూ. 10 కోట్ల నష్ట పరిహారం డిమాండ్ చేసిన ధనుష్
ఇంతకు ముందు ధనుష్ (Dhanush) కూడా ఇలాంటి రీజన్‌తోనే కోర్టును ఆశ్రయించారు. నయనతార నటించిన, ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీ ధాన్’ మూవీలోని విజువల్స్‌ను తన అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో వినియోగించారని, రూ. 10 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. కేసు వేశారు. ఇంకా ఈ కేసు కోర్టులోనే ఉండగా, ఇప్పుడు మరో సంస్థ ఇలాంటి రీజన్‌తోనే కోర్టును ఆశ్రయించడంతో.. మరోసారి నయనతార పేరు వార్తలలో బాగా హైలైట్ అవుతోంది. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో చేస్తుంది. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా కాకుండా ఇతర భాషల్లో మొత్తంగా ఐదారు సినిమాల్లో నయనతార నటిస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు