Suspicious Death: జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం పెద్దతండా (కె)లో బాదావత్ లక్ష్మీ (45) అనే మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది. గ్రామస్తుల సమాచారం ప్రకారం, లక్ష్మీకి భర్త తిరుపతి సుమారు 20 ఏళ్ల క్రితమే మరణించగా, అప్పటి నుండి కూతురు సంగీతతో కలిసి జీవనాన్ని కొనసాగించింది. ఐదు సంవత్సరాల క్రితం సంగీతకు వివాహం జరిపి, అప్పటి నుండి లక్ష్మీ ఒంటరిగానే కూలీ పనులు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే రాత్రి 11 గంటల సమయంలో ఓ కారులో ముగ్గురు వ్యక్తులు లక్ష్మీ ఇంటికి వచ్చినట్లు తండావాసులు గుర్తించారు. అయితే వారు ఆమె బంధువులేమోనని అనుకున్నామని తెలిపారు. ఉదయం కూలీ పనికి రావాలని పిలిచేందుకు వెళ్లిన మహిళ లక్ష్మీ మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు తెలిపింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై దూలం పవన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి లక్ష్మీ ఇంటికి వచ్చిన వారు ఎవరు..? వారు హత్య చేశారా..? లేక ఇది ఆత్మహత్యా..? అన్న అనుమానాలపై గ్రామంలో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
Also Read: Maoist Party: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్ జీ?
అక్రమ ఇసుక లారీ పట్టివేత.. పరారీలో లారీ డ్రైవర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) బూర్గంపాడు మండలం సోంపల్లి పంచాయతీ పరిధిలో గల బుడ్డగూడెం గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక లోడ్ చేస్తున్న లారీని బూర్గంపాడు అదనపు ఎస్సై నాగబిక్షం పట్టుకున్నారు. పట్టుబడిన అట్టి లారీ( TS 36T 4438)ని స్టేషన్స్ కు తరలించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు (ఎస్ హెచ్ ఓ) మేడ ప్రసాద్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్నవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కిన్నెరసాని నది పరివాహక ప్రాంతాలను అక్రమ ఇసుక రవాణాకు అడ్డాగా చేసుకుని కొందరు వ్యక్తులు యదేచ్చగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని అట్టి వారిపై చట్టం తన పని తను చేసుకుని పోతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.అక్రమ ఇసుక రవాణా జరిగినట్లయితే ప్రజలు,అధికారులకు సమాచారం ఇచ్చి సహకరం అందించాలని ఈ సందర్భంగా తెలిపారు.
Also Read: Crime News: చికిత్స పొందుతున్న యువతి పై అఘాయిత్యం.. నిందితుడు అరెస్ట్.. ఎక్కడంటే..?