Viral Comments | క్రికెట్‌పై కీలక వ్యాఖ్యలు
I Dont Even Want To Watch The World Cup Riyan Parag
స్పోర్ట్స్

Viral Comments: క్రికెట్‌పై కీలక వ్యాఖ్యలు

I Dont Even Want To Watch The World Cup Riyan Parag: టీ20 ప్రపంచకప్‌లో స్టార్ట్ అయిన మ్యాచ్‌లు నాన్‌స్టాప్‌గా బ్రేకుల్లేకుండా జరుగుతున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ అద్భుత విజయం సాధించి పుల్ జోష్‌ మీదుంది. అయితే జట్టుకు ఎంపిక కాని రియాన్‌ పరాగ్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు వరల్డ్‌ కప్‌ కోసం తీసుకుంటారనే చర్చ వచ్చింది. కానీ, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో తనకు ఈసారి వరల్డ్‌ కప్‌పై ఆసక్తి లేదని పరాగ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

నేను వరల్డ్‌ కప్‌ జట్టులో ఉండుంటే.. ఏమమవుతుందనే కంగారు ఉండేది. కానీ, ఇప్పుడీ టీమ్‌లో లేను. కాబట్టి నాకు పెద్దగా ఆసక్తి లేదు. చాలా మంది టాప్‌-4లో ఎవరు ఉంటారనే దానిపై చర్చిస్తున్నారు. ఇప్పుడే సమాధానం చెబితే కొన్ని జట్లపై పక్షపాతం చూపించినట్లు అవుతుంది. నిజాయతీగా చెప్పాలంటే.. అసలు ఈసారి వరల్డ్‌ కప్‌ను చూడాలని కూడా నాకు లేదు. చివరికి ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూస్తా. దాంతోనే సంతోష పడతా. నేను ఒకవేళ జట్టులో ఉంటే.. అప్పుడేమైనా టాప్‌ 4 టీమ్‌లు గురించి ఆలోచించేవాడినేమో. మైదానంలో విరాట్‌ కోహ్లీ చూపించే జోష్‌ను ఎవరూ అందుకోలేరని పరాగ్ తెలిపాడు. ఈ యువ బ్యాటర్ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాడు.

Also Read: మెగా టోర్నీలో రికార్డులు బ్రేక్

గతేడాది ఐపీఎల్‌లో పెద్దగా రాణించకపోయినా.. తన ప్రవర్తనతో నిత్యం వార్తల్లో నిలిచేవాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 17వ సీజన్‌లో నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందాడు. కానీ, మళ్లీ తన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కోవడం మొదలైంది. జాతీయ జట్టులోకి రావడంపైనా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ఏదో ఒక సమయంలో నన్ను తీసుకొనే పరిస్థితి వస్తుంది. తప్పకుండా భారత జట్టు కోసం ఆడతాననే నమ్మకం ఉంది. అదెప్పుడు అనేది నాకు తెలియదని పరాగ్‌ చెప్పాడు. ఇప్పుడు మళ్లీ ఇలాంటి కామెంట్లతో నెట్టింట వైరల్‌గా మారాడు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..