Jishnu Dev Verma (imagecrdit:swetcha)
తెలంగాణ

Jishnu Dev Verma: జైళ్ల శాఖ సిబ్బంది కృషి శ్లాఘనీయం: గవర్నర్​ జిష్ణుదేవ్ వర్మ

Jishnu Dev Verma: క్షణాకావేశంలో.. ఇతరత్రా కారణాలతో నేరాలకు పాల్పడి జైళ్ల పాలవుతున్న ఖైదీలను సంస్కరించటానికి ఆ శాఖ సిబ్బంది చేస్తున్న కృషి శ్లాఘనీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) అన్నారు. రావు బహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్​ అకాడమీలో 7వ ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మీట్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ జైళ్ల శాఖ సిబ్బందిలో కనిపించే క్రమశిక్షణ, అంకిత భావం అభినందనీయమని చెప్పారు.

సిబ్బంది మధ్య ఐకమత్యత

సిబ్బంది బయటకు కనిపించకుండా విధులు నిర్వర్తిస్తున్నా అంతర్గత భద్రత, ఖైదీలను సంస్కరించే దిశలో చేస్తున్న కృషి కీలకమైందన్నారు. డ్యూటీ మీట్ లో మొట్ట మొదటిసారిగా భాగంగా టెక్నికల్ ఎగ్జిబిషన్ తోపాటు ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల స్టాళ్లను ఏర్పాటు చేయటంపై జైళ్ల శాఖ అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ డ్రివెన్ సర్విలెన్స్ సిస్టం(Artificial Intelligence Driven Surveillance System), డ్రోన్లు, స్కానర్లు, మాదక ద్రవ్యాలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం, రోబోటిక్స్ ను పరిశీలించారు. హోం శాఖ స్పెషల్ ఛీఫ్​ సెక్రటరీ రవిగుప్తా మాట్లాడుతూ ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్ ఆయా రాష్ట్రాల జైళ్ల శాఖ సిబ్బంది మధ్య ఐకమత్యతను పెంచుతుందన్నారు. విజ్ఞానం పరస్పరం బదిలీ చేసుకుంటారని చెప్పారు. తెలంగాణ జైళ్ల శాఖలో అమలు చేస్తున్న సంస్కరణలు, పునరావాస చర్యలను అభినందించారు.

Also Read: Hyderabad: గణేశ్ నిమజ్జనాల తర్వాత హైదరాబాద్‌‌లో భారీగా వ్యర్థాలు.. ఎంత సేకరించారో తెలుసా?

సరికొత్త ఆలోచనలు

పోటీలో పాల్గొన్న వారు అవార్డులతోపాటు సరికొత్త ఆలోచనలు, సరికొత్త ప్రేరణతో తిరిగి వెళతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. డీజీపీ డాక్టర్ జితేందర్(DGP Dr. Jitender) మాట్లాడుతూ ఛాలెంజ్​ గా తీసుకుని ఆలిండియా ప్రిజన్​ డ్యూటీ మీట్ ను నిర్వహిస్తున్న తెలంగాణ జైళ్ల శాఖ అధికారులను అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో జైళ్ల శాఖ పాత్ర కీలకమైందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ జైళ్ల శాఖ సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. జైళ్ల శాఖ డీజీపీ సౌమ్యా మిశ్రా ప్రిజన్(DGP Soumya Mishra in prison) డ్యూటీ మీట్ కు స్వాగతం పలికారు. టూరిజం శాఖ హస్తకళ, హ్యాండ్లూం ఉత్పత్తుల స్టాళ్లను ఏర్పాటు చేసింది. డిస్కౌంట్ ధరలకే వీటిని అందుబాటులో ఉంచింది. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, అందాలు తెలియ చేసేలా ఏర్పాట్లు చేసింది. కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీలు రాజేశ్​, మురళీబాబు, డీఐజీలు శ్రీనివాస్​, సంపత్​, సంతోష్​ కుమార్​ రాయ్​. చెంచల్​ గూడ సెంట్రల్ జైలు సూపరిండింటెంట్​ నవాబ్​ శివకుమార్​ గౌడ్​ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Kalvakuntla Kavitha: కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి.. జై కొట్టిన కవిత

Just In

01

Konda Surekha: విడ‌త‌ల‌వారీగా అర్హులంద‌రికీ ఇండ్లు ఇస్తాం.. మంత్రి కొండా సురేఖ హామీ

GHMC: జీహెచ్ఎంసీ కొత్త ఆలోచన.. ఖైరతాబాద్ రాజ్‌భవన్ రోడ్డుపై.. ప్లాస్టిక్ టైల్స్ ప్రయోగం

Nayanthara: ఐదు కోట్ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సిందే.. నయనతారకు కొత్త చిక్కులు!

MLA Dr. Rajesh Reddy: సమాజానికి సేవ చేసే జర్నలిస్టుల ఆరోగ్యం ఎంతో ముఖ్యం.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Army Recruitment Rally: యువతకు గుడ్ న్యూస్.. హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. వివరాలు ఇవే!