Collector Rizwan Basha: తన యాస, భాష, మాటలతో సమాజాన్ని సామాజికంగా జాగృతం చేసిన మహాకవి కాళోజీ నారాయణరావు అని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా(Collector Rizwan Basha సమాజాన్ని జాగృతం చేసిన కవి కాళోజీ జనగామ జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్యలు) షేక్ అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని కలెక్టరెట్‌లో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు జాతికి కాళోజీ చేసిన సేవలు మరువలేనివన్నారు. నా గొడవ అంటూ అందరిని చైతన్యం చేసిన కవి కాళోజీ అని, ఆయన ప్రజల భాషలో రచనలు చేసిన గొప్ప మేధావి అని అన్నారు.
సామాజిక రచనలు చేసిన సామాజిక ఉద్యమకారుడు కాళోజీ అని, ఆయన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడన్నారు. కాళోజీ చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషన్ బిరుదుతో సత్కరించిందని గుర్తు చేశారు. ఆయన పుట్టినరోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందరు కాళోజీని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, బెన్షాలోమ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Also Read: Bhatti Vikramarka: మధిర నియోజకవర్గంలో రూ.45 లక్షలతో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన.. డిప్యూటీ సీఎం
శ్రీ కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు
తెలుగు సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు పొందిన మహాకవి, స్వాతంత్ర్య సమర యోదుడు, పద్మ విభూషణ్ “శ్రీ కాళోజీ నారాయణ రావు” జయంతి సందర్భంగా మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ చంద్ర ప్రకాష్ కాళోజీ నారాయణ రావు చిత్ర పఠానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ కాళోజీ రచనలు ప్రజల హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం పోరాడే శబ్దంగా నిలిచాయని కొనియాడారు. ఆయన రచనలు ప్రజల భావోద్వేగాలకు అద్దం పడుతూ – సాధారణ జనాల భాషలో, సామాజిక సందేశంతో ఉంటాయని, వారి రచనలు సమాజానికి మార్గదర్శకం అని అన్నారు.
తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి, తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించిన ప్రజా కవి కాళోజీ నారాయణ రావు జయంతి ని తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకోవడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొనారు.
Also Read: Apple iPhones: ఐఫోన్ 15,16 సిరీస్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా 20,000 తగ్గింపు