Illegal Belt Shops( IMAGE credit: twitter or swetcha reporter)
నార్త్ తెలంగాణ

Illegal Belt Shops: మద్యం బాటిల్ పై స్టిక్కర్ దందా.. వైన్స్ యజమానులే అధికారులా?

Illegal Belt Shops: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో మద్యం వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేసినట్టే కనిపిస్తున్నా అసలు చర్యలే లేవు. వైన్ షాపుల యజమానులే స్టిక్కరింగ్ పేరుతో బెల్టు షాపుల దందాను జోరుగా నడిపిస్తున్నారు. గ్రామాల్లో వందల సంఖ్యలో నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు (Illegal Belt Shops) నడుస్తున్నాయి. కానీ వైన్స్ షాపుల్లో బీర్లు నిల్ కానీ బెల్టు షాపుల్లో మాత్రం ఫుల్,స్టిక్కరింగ్ ఒక్కో బాటిల్‌పై 30–40 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ మందుబాబులపై మోపెస్తున్నారు.

 Also Read: Bigg Boss 9 Telugu: కామనర్స్ చేతిలో బలైన హీరోయిన్? ఇక ఆ బ్యూటీ అవుటేనా?

మద్యం బాటిల్ పై స్టిక్కర్ దందా

సర్కారు నిర్ణయించిన రేట్లు పక్కన పెట్టి స్టిక్కర్ పేరుతో అదనపు వసూళ్లు జరుగుతున్నాయి. ఉదాహరణకు, కేఎఫ్ స్ట్రాంగ్ బీర్‌కు ప్రభుత్వం నిర్ణయించిన రేటు రూ.180. కానీ వైన్స్ షాపు యజమానులు బెల్టు షాపులకు రూ.190కి అమ్ముతున్నారు. ఇక బెల్టు షాపులు అది రూ.230కి కస్టమర్లకు అందిస్తున్నాయి. ఈ దందా అంతా అధికారుల అండతోనే నడుస్తోందన్నది స్థానికుల ఆరోపణ. పలుమార్లు ప్రజలు సమాచారం ఇచ్చినా ఎక్సైజ్ శాఖ ‘నిమ్మకునీరు ఎత్తినట్లు’ వ్యవహరిస్తోందంటున్నారు. వైన్ షాపుల నుండి నెలసరి వాటాలు అందుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వైన్స్ యజమానులే అధికారులా..?

మరికొక షాకింగ్ విషయమేమిటంటే వైన్ షాపుల యజమానులే బెల్టు షాపులపై దాడులు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వేరే ప్రాంతం నుండి మద్యం తెచ్చిన బెల్టు షాపులపై వెంటనే సమాచారం ఇచ్చి దాడులు చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.దాడుల్లో పట్టుకున్న సీసాలను లెక్కల ప్రకారం ఆరు నెలల తర్వాత ధ్వంసం చేయాల్సి ఉండగా… వాస్తవానికి కొంతమాత్రమే ధ్వంసం చేసి, మిగతా సీసాలను మళ్లీ వైన్స్ షాపులకే అందజేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మందుబాబుల కుటుంబాలు ఈ అక్రమాల వలన దిక్కుతోచని పరిస్థితుల్లో మునిగిపోతున్నా… ఎక్సైజ్ అధికారులు మాత్రం మౌనం వీడటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read: Kajal Aggarwal: ” నేను బతికే ఉన్నాను ” చంపేయకండి.. ఆ వార్తల పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్

Just In

01

Bigg Boss Telugu 9: మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

Telangana: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త జోష్.. ఎందుకంటే?

Hyderabad Collector: చాకలి ఐలమ్మ వర్శిటీ పనులపై.. కలెక్టర్ హరిచందన కీలక ఆదేశం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేది అప్పుడేనా?

Summit of Fire: ఖతార్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు.. మరో కొత్త ఆపరేషన్