bellam-konda-sai-srinuvas(image :X)
ఎంటర్‌టైన్మెంట్

Bellamkonda Sai Srinivas: వారి వల్లే సినిమాకు అలా జరిగింది.. అలా అనే సరికి బాధేస్తోంది

Bellamkonda Sai Srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం ‘కిష్కింధపురి’ (Kishkindhapuri). కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. చిత్రాన్ని సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. తాజాగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. సినిమా గురించి అనేక విశేషాలు పంచుకున్నారు. సినిమా మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ ఈ సినిమాలో లేదనే విషయాన్ని తెలియజేశారు. అంతేకాదు, ఈ స్మోకింగ్ యాడ్‌పై ఆయన ఇచ్చిన వివరణ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాను ప్రచారం చేయడంలో మూవీ టీం దూసుకుపోతుంది. తాజాగా బెల్లంకొండ ఇచ్చిన ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read also-Mahabubabad District: గంజాయి మత్తులో లారీ డ్రైవర్లపై దాడి.. వాహనాలు ఆపి బెదిరింపులు.. ఎక్కడంటే?

అంతే కాకుండా తన మనసుకు నచ్చిన కథల గురించి చెప్పుకొచ్చారు. హైందవ, కిష్కిందపురి సినిమాలు చాలా బాగుంటాయని, అలాగే భైరవం కూడా బాగుంటుందిని చెప్పుకొచ్చారు. అయితే భైరవం సినిమాకు ఏం జరిగిందో కూడా చెప్పుకొచ్చారు. భైరవం సినిమా విడుదల ముందు వరకూ చాలా కాన్పిడెంట్ గా ఉన్నాను. అయితే ఈ పత్రికల్లో వచ్చిన వార్తలు ఈ సినిమా గరుడ సినిమా రిమేక్ అంట, అంటే చూడటానికి ఎవరికి ఆసక్తి ఉంటుంది. ప్రేక్షకుల వరకు ఎందుకు ఆ సమయంలో నాకు అయినా అది ఆసక్తిగా అనిపించదు. అంటూ ఇలా రిమేక్ అని రాసేవారి గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సినిమాల గురించి ఎప్పుడూ రిగ్రేట్ అవ్వలేదని, ఎందుకంటే అంత చెత్త సినిమాలు తీయనని చెప్పుకొచ్చారు.

Read also-Shocking Case: అడవిలో ఓ వివాహిత, ఆమె ఫ్రెండ్ మృతదేశాల గుర్తింపు.. కాల్ రికార్డ్స్ పరిశీలించగా..

ఈ సినిమా కథ ఒక పాత రేడియో స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక భూత టూర్ స్థలంగా ప్రసిద్ధి చెందిన మిస్టీరియస్ ప్రదేశం. హీరో-హీరోయిన్ భూతాలపై ఆసక్తి ఉన్న పర్యాటకులను ఆ స్థలానికి తీసుకెళతారు. కానీ, వారు అక్కడికి చేరిన తర్వాత, ఒక నిద్రాణమైన ఆత్మను ఆరవడం జరుగుతుంది. ఇది భయానకమైన సంఘటనలు, డెమాన్స్ (ప్రియాలు) ఎలిమెంట్స్‌తో కూడిన థ్రిల్లింగ్ జర్నీగా మారుతుంది. ట్రైలర్ ప్రకారం, “కొన్ని తలుపులు తెరవకూడదు” అనే డైలాగ్‌తో సస్పెన్స్ పెంచారు. ఇది కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రంగా, క్రిటిక్స్ ఆడియన్స్ ఇద్దరినీ ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు సినిమాపై మరింత హైప్ పెంచాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కు ఈ సినిమాతో అయినా బ్రేక్ రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Just In

01

Bigg Boss Telugu 9: మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

Telangana: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త జోష్.. ఎందుకంటే?

Hyderabad Collector: చాకలి ఐలమ్మ వర్శిటీ పనులపై.. కలెక్టర్ హరిచందన కీలక ఆదేశం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేది అప్పుడేనా?

Summit of Fire: ఖతార్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు.. మరో కొత్త ఆపరేషన్