Heavy Rains: తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడొచ్చని పేర్కొంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
18 జిల్లాలో భారీ వర్షం!
తుఫాన్ ప్రభావంతో 18 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. హైదరాబాద్ నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.
Also Read: Nepal GenZ Protests: నేపాల్‌లో అల్లకల్లోలం.. రాష్ట్రపతి భవన్‌కు నిప్పు.. ప్రధాని ఇల్లు ధ్వంసం
40-60 కి.మీ వేగంతో గాలులు..
పైన పేర్కొన్న జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 24 గంటల్లో 10-15 సెం.మీ. వర్షం కురవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతేకాకుండా గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. దీని వల్ల చెట్లు, స్తంభాలు పడిపోవచ్చని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షం తీవ్రత అధికంగా ఉన్న సందర్భాల్లో ఎవరు బయటకు రావొద్దని సూచించింది.
Also Read: Kalvakuntla Kavitha: కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి.. జై కొట్టిన కవిత
ఆ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
మరోవైపు తెలంగాణలోని దక్షిణాది జిల్లాలు, మధ్య ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ వంటి ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురవొచ్చని అభిప్రాయపడింది.