Bhatti Vikramarka: రూ.45 లక్షలతో సిసి రోడ్లకు శంకుస్థాపన
Bhatti Vikramarka( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Bhatti Vikramarka: మధిర నియోజకవర్గంలో రూ.45 లక్షలతో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన.. డిప్యూటీ సీఎం

Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపనలు చేశారు. ) శంకుస్థాపనలు చేశారు.  ఖమ్మం జిల్లా(Khammam District) మధిర నియోజకవర్గం పర్యటనలో భాగంగా పలు సిసి రోడ్లు, (CC Road) అంగన్వాడి భవనాలకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(Collector Anudeep Durisetty) తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో రూ.1.75 లక్షలతో సిసి రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం ఎస్సీ కాలనీలో రూ.45 లక్షలతో సిసి రోడ్డు (CC Road) పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు.

 Also Read: Manoj Manchu: ‘మిరాయ్’ ఈవెంట్‌లో మనోజ్ మంచు ‘ఓజీ’ ప్రమోషన్.. ఇది వేరే లెవల్ అంతే!

40 లక్షల నిధులతో పలు సిసి రోడ్ల అభివృద్ధి

అదేవిధంగా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం గ్రామంలో రూ.85 లక్షలతో సిసి రోడ్లు, రూ.12 లక్షలతో అంగన్వాడి భవన నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కోసం విద్యా వాతావరణం బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో రూ. 40 లక్షల నిధులతో పలు సిసి రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు లా ప్రభుత్వం చేపడుతుందన్నారు.

నిరుపేదల సంక్షేమం కోసమే సంక్షేమ పథకాలు

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రతి గ్రామానికి అభివృద్ధి వసతులు అందించే దిశగా ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేస్తుందన్నారు. గ్రామీణ మౌలిక అభివృద్ధి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నిరుపేదల సంక్షేమం కోసమే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన అభివృద్ధి, సంక్షేమం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) కృషి చేస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలోని ప్రజలపై అప్పుల భారం పడిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో  బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదని వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రాన్ని అప్పుల కోరల్లోకి నెట్టివేసిన బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేకుండా ప్రజలు తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

 Also Read: Mahabubabad District: యూరియా కోసం పొద్దున్నే క్యూ కట్టిన రైతులు.. ఎక్కడంటే..?

Just In

01

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం

Revanth Reddy – Messi: మెస్సీతో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్