Bigg Boss 9 Telugu: అయ్యో పాపం రా .. అలా ఏడిపించకండి?
Bigg Boss 9 Telugu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss 9 Telugu: కామనర్స్ చేతిలో బలైన హీరోయిన్? ఇక ఆ బ్యూటీ అవుటేనా?

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ నామినేషన్స్ అంటే హాట్ అండ్ హీట్ లా ఉంటుందని అందరికి తెలిసిందే. ఇక మొదటి వారం నామిషన్స్ కి హౌస్ మేట్స్ సిద్ధమయ్యారు. ప్రోమో లో బిగ్ బాస్ చెప్పినట్లు ముందుంది మొసళ్ళ పండుగ అంటూ.. ఆ పండుగ ఇప్పుడే మొదలైంది. రచ్చ స్టార్ట్.. ఆట షురూ. ఇక ఈ రోజు దీనికి సంబందించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది. చూడటానికి చాలా చాలా రసవత్తరంగా ఉంది. ప్రేక్షకులకు కూడా ఇలాంటి ఎంటర్టైన్మెంటే కావాలి. అయితే, ఈ ప్రోమోలో(Bigg Boss Season 9) కంటెస్టెంట్స్ అందరూ సంజనను టార్గెట్ చేయడం కొత్తగా ఉంది. ఇప్పుడు, ఈ గేమ్ ఎలా ఎటువైపు వెళ్తుందో చూడాలి. కామన్ పీపుల్స్  అందరూ సంజనను ఎందుకు టార్గెట్ చేశారో తెలియాలంటే.. ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రోమో అయితే ఫుల్ వైరల్ అవుతుంది.

Also Read: Hyderabad News: జీడిమెట్లలో సామాజిక కార్యకర్త అరుదైన ఆలోచన.. ప్రాణానికి కవచం గా ‘గో స్లో’ నినాదం..?

కామనర్స్ చేతిలో బలైన హీరోయిన్?

బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పటికే కామన్ ఓనర్స్‌గా ఫంక్షన్ చేస్తున్న సెలబ్రిటీలు, టెనెంట్స్ మధ్య డ్రామా జోరుగా సాగుతోంది. సీజన్ 9లో మొదటి నామినేషన్స్ సమయంలో బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఓనర్స్ అందరూ కలిసి టెనెంట్స్‌లో ఒకరిని నామినేట్ చేయాలని ఆదేశించాడు. దీంతో, ఓనర్స్ టీమ్ డీప్ డిస్కషన్ చేసి, సంజన గల్రానీని టార్గెట్ చేసుకుని యూనానిమస్‌గా నామినేట్ చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని మర్యాద మనీష్ స్పష్టంగా వివరిస్తూ, “మేము అందరం కలిసి సంజనను నామినేట్ చేయాలనుకుంటున్నాం. ఆమె వల్ల వేరే ప్లేయర్లు హీట్ ఆఫ్ ది మూమెంట్‌లో ఏదో ఒక మాట అనేసి ట్రబుల్‌లో పడాల్సి వస్తోంది. మిస్‌ అండర్‌ స్టాండింగ్స్ పెరుగుతున్నాయి. అలాగే, మీరు అబద్ధాలు కూడా ఆడుతున్నారు” అంటూ తీవ్రంగా వాదించాడు.

Also Read: CM Revanth Reddy: 100రోజుల్లో మేడారం అభివృ‌ద్ధి పనులు పూర్తి చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

మొదటి వారం..  ఇక ఆ బ్యూటీ అవుటేనా?

ఇది విన్న సంజన గల్రానీ కూడా ఘాటుగా స్పందించింది. “మీ ఆరుగురిలో ఎవరైనా వాటర్ తాగడానికి ఇంట్లోకి వచ్చినప్పుడు పర్మిషన్ తీసుకోవాలని ఎవరైనా చెప్పారా?” అని ప్రత్యక్షంగా ప్రశ్నించింది. ప్రియా దీనికి సమాధానంగా, “అది బిగ్ బాస్ ముందే చెప్పాడు” అని చెప్పగానే గొడవ పెద్దది అయింది. “మీరు 100% బ్యాక్‌బైటింగ్ చేస్తున్నారు” అంటూ ప్రియా ఫైర్ అవుతూ ఆరోపించగా, ఆ పదానికి సంజన సీరియస్‌ అయింది. “అలాంటి డర్టీ వర్డ్స్ వాడకండి ” అంటూ ఫైర్ అయింది. దీంతో, బ్యాక్‌బైటింగ్ టాపిక్ మీద డిబేట్ మరింత హీట్ అయింది. సంజనతో పాటు ఆషా షైనీ కూడా మాట్లాడుతూ, “నువ్వు నా రిలేషన్ గురించి మూడుసార్లు ఎందుకు మాట్లాడావు?” అని సంజనను అడిగింది. ఇలా చూస్తే, బ్యాక్‌ బైటింగ్ వలన హౌస్‌లో ఒక పెద్ద రచ్చే అయి ఉన్నట్టు అనిపిస్తోంది.

Just In

01

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?