Wife Suicide In Bengaluru After Fighting With Husband For Boiled Eggs: ఒకప్పుడు భార్యభర్తలు అంటే ఎంతో అన్యోనంగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా నిలిచేవారు. పెద్దల మాటలు తూచా తప్పకుండా, వారికి గౌరవం ఇస్తూ అణిగి మణిగి ఉండేవారు. కానీ నేటి కాలంలో కొద్దిపాటి వాటికే మనస్పర్థలు వచ్చి గొడవలు పడటం దంపతులకు కామన్ అయిపోయింది. ఆ గొడవలు కూడా అంతటితో ఆపకుండా విడిపోయి ఉండటం, మరికొన్ని ఘటనలు అయితే గొడవల కారణంగా కలిసుండటం కుదరదని ఏకంగా విడాకులు కూడా తీసుకున్నవారున్నారంటే అతిశయోక్తి కాదు. గతంలో కురుకురే తీసుకురాలేదని భార్య భర్తకు విడాకుల కోసం కోర్టులో విడాకులు అప్లై చేసిన ఘటన, ఇంకా ఇలాంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. ఇంకొన్ని గొడవలు అయితే సహనం కోల్పోయి వారి ప్రాణాలతో పాటు వారి పిల్లల ప్రాణాలను బలి తీసుకున్నారు. అలాంటి ఘటనే తాజాగా కర్నాటక రాష్ట్రంలో జరిగింది.
ఉడకబెట్టిన కోడిగుడ్ల కోసం ఇద్దరు దంపతుల మధ్య గొడవ జరిగింది.ఈ గొడవ కాస్త భార్య ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన బెంగళూరులోని మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మే 25వ తేదీన చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లాకు చెందిన అనిల్ కుమార్ కుమార్ కోరి, పూజ అనే దంపతులు బతుకుదెరువు కోసం బెంగళూరు నగరానికి కొన్నేండ్ల క్రితం వలస వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. మచహోహళ్లిలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో అనిల్, పూజ పని చేస్తున్నారు. ఫ్యాక్టరీలోని బిల్డింగ్‌లోనే వారు నివాసం ఉంటున్నారు.అయితే మే 25వ తేదీన రాత్రి భార్య కోడిగుడ్లను ఉడకబెట్టింది.
Also Read: సోనియా అలా..మోదీ ఇలా
తాను ఇంటి యజమానిని తనకు కోడిగుడ్లు ఎక్కువగా కావాలని పూజను తన భర్త అనిల్ ఆదేశించాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక అనిల్, ఇద్దరు పిల్లలు గాఢ నిద్రలోకి జారుకున్నాక పూజ అటు నుంచి వెళ్లిపోయింది. భార్య కనిపించకపోయేసరికి అనిల్ ఆందోళనకు గురయ్యాడు. స్థానికుల సహాయంతో అంతా వెతికాడు. బిల్డింగ్ ఆవరణలో రక్తపు మడుగులో ఉన్న పూజను చూసి అనిల్ షాక్‌కు గురయ్యాడు. బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకి పూజ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.