Apple iPhones: ఐఫోన్ సిరీస్‌లపై భారీగా డిస్కౌంట్లు..?
Apple iPhones
Viral News, బిజినెస్

Apple iPhones: ఐఫోన్ 15,16 సిరీస్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా 20,000 తగ్గింపు

Apple iPhones: మార్కెట్ లో ఎన్ని ఫోన్స్ వచ్చినా iPhone చాలా స్పెషల్ గురు. ఎందుకంటే, దీనిలో ఉండే సాఫ్ట్వేర్ వేరు. అలాగే మోడల్ నుంచి ఫీచర్స్ వరకు అన్ని కొత్తగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చాలా మందికి డ్రీమ్ ఫోన్ గా కూడా ఉంటుంది. డబ్బు సంపాదిస్తే ముందు చేసే పని ఐ ఫోన్ కొనుక్కోవడం. ఈ రోజుల్లో ఈ ఫోన్ ఎదుటి వాళ్ళ రేంజ్ ను కూడా తెలియాజేస్తుంది.

iPhone 15

మొన్నటి వరకు iPhone 15 రేట్స్ భగ్గుమన్న ధరలు 128GB స్టోరేజ్ వేరియంట్ సెప్టెంబర్ 2023లో లాంచ్ సమయంలో రూ.79,900 గా ఉంది. అయితే, ప్రస్తుతం ఆఫర్ లో ఇది రూ.62,290 కు రానుంది. ఇక్కడ మీరు బ్యాంక్ ఆఫర్‌లో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్‌పై రూ.3500 తగ్గింపు పొందొచ్చు. ఈ భారీ డిస్కౌంట్ తో iPhone 15 కేవలం రూ.58,790కి వస్తుంది. అంటే, ఈ ఐఫోన్ లాంచ్ ధర కంటే రూ.21,110 తగ్గుతోంది.

iPhone 15 Plus

iPhone 15 Plusలోని 128GB స్టోరేజ్ వేరియంట్ సెప్టెంబర్ 2023లో రూ.89,900 గా ఉంది. ఇప్పుడు రూ.66,990 కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లో.. HDFC బ్యాంక్ క్రెడిట్ పై రూ.3500 తగ్గింపు పొందొచ్చు. ఈ భారీ డిస్కౌంట్ తర్వాత దీనిని రూ.63,490కి రానుంది. అంటే ఈ ఐఫోన్ లాంచ్ ధర కంటే రూ.21,110 తగ్గుతుంది.

iPhone 16

iPhone 16లోని 128GB స్టోరేజ్ వేరియంట్ 2024లో సెప్టెంబర్‌లో రూ.79,900కి లాంచ్ అయింది. ఇప్పుడు రూ.69,990 కి అందుబాటులో ఉంది. HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ చెల్లింపుపై రూ.3500 తక్షణ తగ్గింపును పొందొచ్చు. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని రూ.66,490కి కొనుగోలు చేయోచ్చు.

iPhone 16 Plus

iPhone 16 Plusలోని 128GB స్టోరేజ్ వేరియంట్ 2024 సెప్టెంబర్‌లో రూ.89,900కి లాంచ్ అయింది. ప్రస్తుతం రూ.78,290 కి లిస్ట్ అయింది. HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్‌పై రూ.4500 తగ్గింపు పొందొచ్చు. ఈ భారీ డిస్కౌంట్ తర్వాత దీనిని రూ.73,790కి కొనుగోలు చేయోచ్చు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..