Kajal Aggarwal ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Kajal Aggarwal: ” నేను బతికే ఉన్నాను ” చంపేయకండి.. ఆ వార్తల పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్

Kajal Aggarwal: గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ పేరు మారు మోగుతుంది. ఆ స్టార్ బ్యూటీ కి భారీ యాక్సిడెంట్ అయ్యిందని, కారు నుజ్జు నుజ్జు అయి, తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చేరారని, ఇంకా కొందరు ‘ఆమె ఇకలేదు’ పోస్ట్ లు కూడా పెట్టారు. ఈ ఫేక్ న్యూస్ వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. మరి, ఆ హీరోయిన్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Hyderabad News: జీడిమెట్లలో సామాజిక కార్యకర్త అరుదైన ఆలోచన.. ప్రాణానికి కవచం గా ‘గో స్లో’ నినాదం..?

ఆమె ఎవరో కాదు మగధీర బ్యూటీ కాజల్ అగర్వాల్. ఆమె వెళ్తున్న కారు యాక్సిడెంట్ అయి గాయాలపాలైందని వార్తలు వచ్చాయి. ఫ్యాన్స్ కూడా నిజమే అనుకుని ఆమె కోలుకోవాలి పోస్ట్ లు పెట్టారు. “అక్కా, ఏమైంది? బాగుండాలి, మంచిగా ఉండాలి” అంటూ ప్రేయర్స్ చేస్తున్నారు. కానీ వెయిట్, ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఉంది.

Also Read: Hyderabad Collector: ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన.. జిల్లా కలెక్టర్ హరిచందన

ఈ ఫేక్ యాక్సిడెంట్ రూమర్స్‌పై కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయింది. ఆమె X (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి, “నాకు యాక్సిడెంట్ అయ్యిందని, నేను ఇక లేనని చెప్పే నిరాధారమైన వార్తలు చూశాను. అవి పూర్తిగా తప్పు, వాటిలో ఎలాంటి నిజం లేదు. దేవుడి కృప వల్ల నేను పర్ఫెక్ట్‌గా బాగున్నాను, సేఫ్‌గా ఉన్నాను, చాలా బాగా ఉన్నాను. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను నమ్మకండి, స్ప్రెడ్ చేయకండి. పాజిటివిటీ, ట్రూత్ మీద మాత్రమే ఫోకస్ చేయండి” అంటూ రాసింది. ఆమె పోస్ట్ చూస్తే కాజల్ కూడా ఈ రూమర్స్ చూసి షాక్ అయినట్టు తెలుస్తుంది. దీంతో, ఈ తప్పుడు ప్రచారాలకు పూర్తి చెక్ పడింది, ఫ్యాన్స్ కూడా పోస్ట్ లు పెట్టడం ఆపారు.

Also Read: CM Revanth Reddy: 100రోజుల్లో మేడారం అభివృ‌ద్ధి పనులు పూర్తి చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Just In

01

Summit of Fire: ఖతార్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు.. మరో కొత్త ఆపరేషన్

Hyderabad Task Force: రద్దయిన కరెన్సీ మార్పిడికి యత్నం.. గ్యాంగ్ అరెస్ట్ 1.92 కోట్లు సీజ్!

Karisma Kapoor: తండ్రి ఆస్తుల్లో వాటా కోసం ఢిల్లీ హైకోర్టులో కరిస్మా కపూర్ పిల్లలు దావా

Harish Rao: తెచ్చి చూపించండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు ఛాలెంజ్

GHMC: ట్యాక్స్ చెల్లింపులో అక్రమాలకు చెక్.. భారీగా పెరగనున్న జీహెచ్ఎంసీ ఆదాయం!