Manoj Manchu: నేను ఎంతగానో ఇష్టపడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ (OG), మా సినిమా ఒకే నెలలో రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు రాక్ స్టార్ మంచు మనోజ్. మొన్న ‘మిరాయ్’ (Mirai) నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, నిన్న ‘మిరాయ్’ చిత్ర హీరో ‘తేజ సజ్జా’.. ఇప్పుడు మంచు మనోజ్.. ఇలా వరసగా పవన్ కళ్యాన్ ఓజీ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుండటంతో.. నెటిజన్లు కొందరు ‘ఓజీ’ నిర్మాణ సంస్థకు చురకలు అంటిస్తున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ పెట్టుకుని ఇంత వరకు ఎలాంటి ఫంక్షన్ చేయలేదు. మీ బదులు ‘మిరాయ్’ మేకర్స్ చేస్తున్న ప్రమోషన్స్ బెటర్ అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం.
వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్
సూపర్ హీరో తేజ సజ్జా సూపర్ యోధగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, సెప్టెంబర్ 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం వైజాగ్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
Also Read- Pawan Kalyan: అల్లు అరవింద్ మదర్ పవన్ కళ్యాణ్‌ని ఏమని పిలిచే వారో తెలుసా?
‘మిరాయ్’తో మనోజ్ 2.0
ఈ కార్యక్రమంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ.. ‘‘మా ప్రీ రిలీజ్ ఈవెంట్ (Mirai Pre Release Event) వైజాగ్‌లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పర్సనల్‌గా నాకు చాలా ఎమోషనల్‌గా ఉంది. నా ఫస్ట్ సినిమా ‘దొంగ దొంగది’ మొత్తం వైజాగ్‌లోనే తీశాం. నేను నటించిన చాలా వరకు సినిమాలు ఇక్కడే షూటింగ్ జరుపుకున్నాయి. నా కెరియర్‌లో చిన్న గ్యాప్ వచ్చిన విషయం అందరికీ తెలుసిందే. నేను ఎక్కడికి వెళ్ళినా అన్నయ్యా.. సినిమా ఎప్పుడు అని అందరూ ఎంతో ప్రేమగా అడిగేవారు. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా.. ఎప్పుడూ మీరు అండగా ఉన్నారు. ఎలాంటి సినిమాతో మళ్ళీ రావాలా? అని అనుకున్నప్పుడు మా డైరెక్టర్ కార్తీక్ నా జీవితంలోకి శ్రీరాముడిలా వచ్చారు. ఇంత గొప్ప స్క్రిప్ట్ ఎలా ఆలోచించగలిగారనిపించింది. ‘మిరాయ్’ సినిమానే నాకు కం బ్యాక్ అని ఈ సినిమా ఒప్పుకున్నాను. ఈ సినిమాలో బ్లాక్ స్వార్డ్ పాత్రలో చేస్తున్నాను. నిజంగా క్యారెక్టర్ మనోజ్ 2.0గా అనేలా ఉంటుంది. తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏది అడ్డు వచ్చినా ఫసక్. ఇంత గొప్ప పాత్రలో నన్ను బిలీవ్ చేసిన డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లకు ధన్యవాదాలు. తేజకి ఓసారి మాటిచ్చాను. తనే నన్ను ఈ పాత్రలోకి తీసుకొచ్చారు. ఈ సినిమా కోసం తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో స్వయంగా నేనే డబ్బింగ్ చెప్పాను. సినిమాని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.
Also Read- Bigg Boss 9 Telugu: బాడీ షేమింగ్.. మొదటి రోజే కామనర్ ఆగ్రహానికి గురైన ఇమ్మానుయెల్!
‘ఓజీ’ వచ్చే వరకు హౌస్ ఫుల్ పెట్టాలి
సెప్టెంబర్ 12 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. రెండు వారాలు గ్యాప్‌లో పవనన్న సినిమా వస్తుంది. ఈ రెండు వారాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కిర్రెక్కించే విజయం ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను. నిర్మాత విశ్వప్రసాద్ అనుకున్నట్లుగా ఈ సినిమా పాన్ వరల్డ్ ఫ్రాంచైజీ గా మారాలి. ఈ సినిమాకు రేట్లు కూడా అందరికీ అందుబాటులో ఉండేలా ఉంటాయి. ఈ సినిమా రెండు వారాలు పాటు హౌస్ ఫుల్ పెట్టాల్సిన బాధ్యత ప్రేక్షకులదే. ఆ తర్వాత పవన్ అన్న ఒజీ వస్తుంది. నేను ఎంతగానో ఇష్టపడే పవన్ అన్న ‘ఓజీ’, మా సినిమా ఒకే నెలలో రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే తమ్ముడు బెల్లంకొండ సాయి చేసిన ‘కిష్కింధపురి’ మాతో పాటు రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమాలు బాగుంటే మూడు నాలుగు సినిమాలు కూడా హిట్ అవుతాయని ప్రేక్షకులు నిరూపించారు. ఇప్పుడు కూడా రాబోయే అన్ని సినిమాలు హిట్ చేస్తారని కోరుకుంటున్నాను..’’ అని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు