Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ (Bigg Boss Telugu Season 9) ఆదివారం (Sep 7) గ్రాండ్‌గా మొదలైన విషయం తెలిసిందే. ఈసారి హౌస్‌లోకి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్‌ని పంపించారు. అందులో 9 మంది సెలబ్రిటీలు, 6 కామనర్స్‌కు చోటు కల్పించారు. హీరోయిన్ సంజన, కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ, నటి రీతూ చౌదరి, నటులు సుమన్ శెట్టి, భరణి వంటి వారితో పాటు జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్ ఈసారి సెలబ్రిటీ లిస్ట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. బిగ్ బాస్ అగ్ని పరీక్షను ఎదుర్కొని హౌస్‌లోకి అడుగు పెట్టిన కామనర్స్‌ను బిగ్ బాస్ ఓనర్స్‌గా ప్రకటించగా, సెలబ్రిటీలను అద్దెకు ఉండేవారిగా ప్రకటించారు. ఓనర్స్ చెప్పింది, అద్దెకు ఉండేవాళ్లు చేయాలని అనేలా డబుల్ హౌస్‌లపై క్లారిటీ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ మొదలైన మొదటి రోజే.. ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు, కామనర్స్‌కు చిన్న చిన్న విషయాలకే విభేదాలు వచ్చేస్తున్నాయి.
Also Read- Little Hearts: ‘లిటిల్ హార్ట్స్’ 3 డేస్ కలెక్షన్లు ఎంతో తెలుసా? ఆ రెండు సినిమాలూ అవుట్!
ఇమ్మానుయెల్ బాడీ షేమింగ్..
అందరూ హౌస్‌లోకి అడుగు పెట్టగా మొదటి రోజు మొదలైంది. ఆట మొదలైన కాసేపటికే బిగ్ బాస్.. ఇంటిని క్లీన్ చేసే బాధ్యత తీసుకున్న ఇమ్మానుయెల్‌ను ఓ ప్రశ్న అడిగారు. మొత్తం క్లీనింగ్‌కు నీకు ఎంత టైమ్ పడుతుంది అంటే, అక్కడ గ్రాస్‌లో పడిన చెత్తను ఒక్కొక్కటిగా తీసేయాలని, అందుకు ఒక రోజుకు పైగా పడుతుందని, ఈలోపు నాకు సిక్స్ ప్యాక్ కూడా వచ్చేస్తుందని ఇమ్మానుయెల్ సమాధానం ఇచ్చారు. అందుకు సంతృప్తి చెందని బిగ్ బాస్.. ఎంత టైమ్ పడుతుందో మీ మ్యానిటర్ నిర్ణయిస్తారని అన్నారు. గుండు అంకుల్.. కాస్త చూడండి.. చూసి ఆలోచించండి అని మ్యానిటర్ అయిన హరీతా హరీష్‌ను ఇమ్మానుయెల్ అన్నారు. మీరు కూడా చూసి మాట్లాడాలి బ్రదర్.. అంటూ హరీష్ కౌంటర్ మొదలెట్టారు. బాడీ షేమింగ్ వరకు వెళ్లవద్దు.. ఎవరు అంకుల్? ఎవరు గుండు? అని హరీష్ సీరియస్ అయ్యారు.
What started as fun turned into fire 🔥 Let’s see how far this fight goes😳
Watch #BiggBossTelugu9 Mon-Fri at 9:30PM, Sat & Sun at 9PM On #StarMaa & Stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaa #JioHotstar #StarMaaPromo pic.twitter.com/Cj8u4m29F1
— Starmaa (@StarMaa) September 8, 2025
సీరియస్ వార్నింగ్
నేను మర్యాదగా వచ్చి సారీ చెప్పా.. అని ఇమ్మానుయెల్ అంటే.. ‘నేను కూడా ఏదో ఒకటి మాట్లాడి సారీ చెప్పనా?’ అని హరీష్ అన్నారు. హ్యూమర్ ఉండాలి కానీ.. ఒక లెవల్ దాట కూడదు అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. మీ మూడ్‌ని బట్టి మనుషులు ఉండరు అని ఇమ్మానుయెల్ అంటే.. ‘మీ మూడ్‌ని బట్టి ఉండాలా ఏంటి?’ అని హరీష్ ప్రశ్నించారు. ‘మా మూడ్‌ని బట్టి ఉండమని అనడం లేదు’ అని ఇమ్మానుయెల్ అంటే.. ‘లిమిట్’ అని హరీష్ అన్నారు. వారిద్దరి మధ్య వివాదం ముదురుతుండగా.. భరణి కల్పించుకుని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది. ఇక హౌస్‌లో ముందు ముందు ఏం జరగబోతుందో తలచుకుంటేనే అర్థమవుతోంది.. సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ యుద్ధం ఏంటనేది. చూద్దాం.. ఈ సీజన్ ఎంత రసవత్తరంగా ఉంటుందో..
Also Read- Nandamuri Balakrishna: అక్కడ బెల్ మోగించిన తొలి సౌత్ ఇండియన్ స్టార్‌గా బాలయ్య రికార్డ్!
బిగ్ బాస్‌లో ఉన్న 15 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే:
సెలబ్రిటీస్:
1. తనూజ (Thanuja Puttaswamy)
2. ఆషా షైనీ (ఫ్లోరా షైనీ) (Flora Saini)
3. జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్ (Emmanuel)
4. కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma)
5. నటుడు భరణి (Bharani Shankar)
6. రీతూ చౌదరి (Ritu Chaudhary)
7. సంజన (Sanjjanaa Galrani)
8. ఫోక్ డ్యాన్సర్ రాము రాథోడ్ (Ramu Rathod)
9. సుమన్ శెట్టి (Suman Shetty)
కామనర్స్:
10. కళ్యాణ్ పడాల (Kalyan Padala)
11. మాస్క్ మ్యాన్ హరీష్ (Harita Harish)
12. డీమాన్ పవన్ (Demon Pawan)
13. దమ్ము శ్రీజ (Dammu Sreeja)
14. ప్రియా శెట్టి (Priya Shetty)
15. మర్యాద మనీష్ (Maryada Manish)
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు