Pawan Kalyan: అల్లు అరవింద్ (Allu Aravind) మదర్ అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnam) పెద్దకర్మను సోమవారం కుటుంబ సభ్యులు గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులెందరో హాజరయ్యారు. మెగా, అల్లు ఫ్యామిలీలు దగ్గరండి ఈ సెర్మణీని జరిపారు. పెద్దకర్మ అనంతరం అల్లు అరవింద్ తన తల్లి సుదీర్ఘ జర్నీలో కొందరికి కృతజ్ఞతలు తెలిపేందుకు సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తన తల్లిని ఇప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకున్న వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు ఆమెతో చాలా మంచి అనుబంధం ఉన్నట్లుగా చెబుతూ.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని ఆమె ఏమని పిలిచేవారో తెలిపారు. ఆయన చెప్పిన ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read- Bigg Boss 9 Telugu: బాడీ షేమింగ్.. మొదటి రోజే కామనర్ ఆగ్రహానికి గురైన ఇమ్మానుయెల్!
కళ్యాణ్ కాదు.. కళ్యాణి అని పిలిచేవారు
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. చిరంజీవి (Chiranjeevi)కి, పవన్ కళ్యాణ్‌కు అమ్మతో ఉన్న అనుబంధం గురించి చెప్పాలి. ముందుగా పవన్ కళ్యాణ్‌తో ఆమె ఎలా ఉండేవారో చెబుతాను. కళ్యాణ్ బాబు సినిమా యాక్టర్ కాకముందు, ఖాళీగా ఉన్న రోజుల్లో.. కళ్యాణ్ బాబుని కళ్యాణి అని పిలిచేది. ‘బాబు కళ్యాణి.. చక్కగా ఉన్నావ్. నువ్వు సినిమాలలో చేయవచ్చు కదా..’ అంటే, ‘నాకు సిగ్గండి, నాకు ఇబ్బంది అండి’ అనే చెప్పేవాడు. కాదు నాన్న.. నువ్వు సినిమాలలో చేయాలి కళ్యాణి అని అనేది. ఈ విషయం కళ్యాణ్ బాబు కూడా ఆ మధ్య ఓ స్పీచ్‌లో చెప్పారు. ఆయనను సినిమాలలో చేయాలని చాలా ఎంకరేజ్ చేస్తూ.. నన్ను కూడా.. ‘ఏరా చక్కగా ఉన్నాడు. కళ్యాణ్‌ను పెట్టి ఓ సినిమా చేయాలి కదరా!’ అని అంటూ ఉండేది. ఇలా ఎంకరేజ్ చేసే వారిలో ఆమె కూడా ఒకరు.
Also Read- Little Hearts: ‘లిటిల్ హార్ట్స్’ 3 డేస్ కలెక్షన్లు ఎంతో తెలుసా? ఆ రెండు సినిమాలూ అవుట్!
‘అమ్మా.. నేను చిరంజీవిని’ అని అనగానే
చిరంజీవి ఎంత మెగాస్టార్ (Megastar) అయినా, కుటుంబ సభ్యుల దగ్గర ఆయన ఎట్లా ఉంటారో అందరికీ తెలియంది కాదు. రెండు, మూడు నెలల క్రితం జరిగిన విషయమిది. నేను రోజూ ఆమెను చూడటం, పలకరించడం చేస్తున్న క్రమంలో ఆమె రెస్పాన్స్ తక్కువగా ఉన్న రోజున.. నేను అమ్మ చేతిలో చెయ్యి పెట్టి.. నన్ను గుర్తుబడితే ఒక్కసారి నొక్కు అనేవాడిని. అలా అలవాటు చేసుకున్నాం. ఇలా ఒకసారి బాగా సీరియస్‌గా ఉన్నప్పుడు చిరంజీవి చూడటానికి వచ్చారు. అమ్మా.. చిరంజీవి, చిరంజీవి వచ్చారు అని అంటే.. వెంటనే ‘అమ్మా.. నేను చిరంజీవిని’ అని అనగానే ఆమె వెంటనే కళ్లు తెరిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. అంటే, చిరంజీవి అంటే ఆవిడకి అంత ఇష్టం. వాళ్లిద్దరూ ఎప్పుడు కలిసినా, చక్కగా మాట్లాడుకుంటారు. హగ్ చేసుకుంటారు. మా అమ్మని అంత ప్రేమగా చిరంజీవి చూసుకునేవారు. అలాంటి అనుబంధం ఉంది వారికి.. అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు