Thummala Nageswara Rao (IMAGE CREDIT: TWITTER)
తెలంగాణ

Thummala Nageswara Rao: యూరియా పంపిణీలో ఇబ్బందులు రావొద్దు.. మంత్రి తుమ్మల ఆదేశాలు

Tummala Nageswara Rao: క్యూ లైన్స్ ఇబ్బందులు తలేకుండా రైతులకు సజావుగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) ఆదేశించారు. యూరియా పంపిణీలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీ చేపట్టాలని సూచించారు. అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 రైతు వేదికల వద్ద రైతు వేదికల వద్ద యూరియా అమ్మకాలు జరిపేందుకు వీలుగా రెండు రోజుల వ్యవధిలో 500 ఈపీఓఎస్ మిషన్లు తెప్పించి, సిబ్బందికి శిక్షణ ఇప్పించి యూరియా అమ్మకాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

 Also Read: CM Revanth Reddy: 100రోజుల్లో మేడారం అభివృ‌ద్ధి పనులు పూర్తి చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

యూరియా పంపిణీ సజావుగా సాగింది 

రైతులకు ముందుగానే టోకెన్లు జారీ చేసి క్యూ లైన్లు లేకుండా తోపులాటలు లేకుండా యూరియా పంపిణీ సజావుగా సాగిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జియో పాలిటిక్స్ వల్ల యూరియా ఇంపోర్ట్ లేకపోవడం, దేశీయంగా ఉత్పత్తి డిమాండ్ కు తగ్గట్టు లేకపోవటంతో తెలంగాణ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో యూరియా సరఫరాలో కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో ఆగస్ట్ లో అదనంగా నలభై వేల మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చుకున్నామని ఇక మీదట ప్రతి రోజు పది వేల మెట్రిక్ టన్నుల యూరియా వివిధ కంపెనీలు సరఫరా చేసేలా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి తో యూరియా సరఫరా మెరుగు పడిందన్నారు. కొన్ని పార్టీలు రాజకీయ స్వార్థంతో యూరియా పంపిణీ కేంద్రాల వద్ద కావాలని ఆందోళనలు చేసి రేవంత్ ప్రభుత్వాన్ని బదనం చేయాలనే దిగజారుడు రాజకీయం చేస్తున్నారని రైతులు వారిపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. రైతులకు ప్రజా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని వెల్లడించారు.

Also Read: Jangaon collector: ప్ర‌జావాణిలో బాధితుల మొర‌.. స‌మ‌స్య‌లు స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించండి!

Just In

01

Mirai Train Stunt: ‘మిరాయ్’ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని హీరో.. ఏం చేశాడో తెలుసా?

PM Modi: భారత్‌తో వాణిజ్య చర్చలు.. ట్రంప్ పోస్టుకు.. ప్రధాని ఆసక్తికర ఆన్సర్!

Crime News: డ్రగ్స్​ దందాలో హవాలా వ్యాపారులు.. చిట్టా విప్పిన ఈగల్ టీమ్!

Anuparna Roy Controversy: వివాదంలో చిక్కుకున్న వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్‌ విజేత.. ఎందుకంటే?

Damodar Rajanarasimha: మీ సేవలు మరువలేం.. ప్రాణాలు కాపాడే పవిత్రమైన వృత్తి మీది