Food Delivery: స్విగ్గి మన రోజులో ఒక భాగం అయిపోయింది. మనం ఫుడ్ తినని సమయంలో మనకీ ముందు గుర్తు వచ్చేది ఇదే. మన ఆకలిని తీరుస్తుంది. ఒకప్పుడు ఫుడ్ లేకపోతే హోటల్ కి వెళ్ళాలి. కానీ, ఇప్పుడు మనకీ ఏది తినాలనిపిస్తే.. అది ఆర్డర్ పెట్టుకుని తినేస్తాము. మెనూ ధరల వ్యత్యాసం స్విగ్గి వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో రెస్టారెంట్‌లు తమ మెనూ ధరలను ఆన్‌లైన్‌లో ఎక్కువగా నిర్ణయించవచ్చు.
10 పొరోటాలు: రెస్టారెంట్‌లో రూ.180, Swiggyలో రూ.350 (94% ఎక్కువ)
చికెన్ 65: రెస్టారెంట్‌లో రూ.150, Swiggyలో రూ. 240 (60% ఎక్కువ)
చికెన్ లాలీపాప్: రెస్టారెంట్‌లో రూ.200, Swiggyలో రూ.320 (60% ఎక్కువ)
చికెన్ బిర్యానీ: రెస్టారెంట్‌లో రూ.280, Swiggyలో రూ.460 (64% ఎక్కువ)
ఈ ధరల పెరుగుదలకు రెస్టారెంట్‌లు Swiggyకు చెల్లించే 18-25% కమిషన్ ఒక కారణం కావచ్చు. ఈ కమిషన్ ఖర్చును భర్తీ చేయడానికి, రెస్టారెంట్‌లు ఆన్‌లైన్ ఆర్డర్‌ల కోసం ధరలను పెంచుతాయి. అందువల్ల, స్విగ్గి ద్వారా ఆర్డర్ చేసిన ఫుడ్ ను రెస్టారెంట్‌లో నేరుగా కొనుగోలు చేసిన దానికంటే ఖరీదైనదిగా ఉంటుంది.
ప్లాట్‌ఫారమ్ ఫీజు స్విగ్గి ఒక్కో ఆర్డర్‌కు రూ.10 ప్లాట్‌ఫారమ్ ఫీజూ వసూలు చేస్తుంది, ఇది కస్టమర్ ప్రొఫైల్‌తో సంబంధం లేకుండా వర్తిస్తుంది. ఈ ఫీజు, ప్లాట్‌ఫారమ్ నిర్వహణ, యాప్ ఫీచర్‌లను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని స్విగ్గి పేర్కొంది. ఈ ఫీపై 18% GST కూడా వర్తిస్తుంది, అంటే ఒక్కో ఆర్డర్‌కు సుమారు రూ. 11.80 అదనంగా చెల్లించాలి.
సోషల్ మీడియాలో, కస్టమర్‌లు ఈ ధరల వ్యత్యాసంపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ఎలా.. ఇంత ధరలు పెడుతున్నారు. మేము తినడానికా? చూడటానికా ?? అంటూ కొందరు మండి పడుతున్నారు. 20-30% అదనపు ఖర్చు సాధారణమని, కానీ 81% అతిగా ఉందని మండి పడుతున్నారు. మరికొందరు రెస్టారెంట్ వాళ్లే ఆన్‌లైన్ ధరలను పెంచుతున్నాయని, స్విగ్గి కేవలం డెలివరి చార్జెస్ జోడిస్తుందని అంటున్నారు. ఈ చర్చలు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల ధరల నిర్మాణంపై నియంత్రణ అవసరమనే అభిప్రాయాన్ని లేవనెత్తాయి.