t20 WorldCup Aaron Jones Sets Record For Highest Score In T20 WorldCup
స్పోర్ట్స్

T20 Match: మెగా టోర్నీలో రికార్డులు బ్రేక్

t20 WorldCup Aaron Jones Sets Record For Highest Score In T20 WorldCup:టీ20 వరల్డ్ కప్ 2024 మ్యాచ్‌ ప్రారంభ దశలోనే రికార్డులు బద్దలయ్యాయి. క్రికెట్ లవర్స్ ఆశించినట్లుగానే మెగా టోర్నీ ఘనంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లోనే పరుగుల సునామీ మొదలైంది. అంతేకాకుండా ఇందులో చాలా ట్విస్ట్‌లు నెలకొన్నాయి. గెలుస్తామనే ఆశలు లేని స్థితి నుంచి అమెరికా, కెనడాపై ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. గ్రూప్ ఏలో రెండు పాయింట్లతో బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 194 రన్స్‌ చేసింది. నవనీత్ దాలివాల్, నికోలస్ కిర్టన్ అర్ధశతకాలు సాధించారు. అలీఖాన్, హర్మీత్ సింగ్, కోరి అండర్సన్ తలో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో అమెరికా 17.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆరోన్ జోన్స్, ఆండ్రిస్ గోస్ విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. ఓ దశలో ఎనిమిది ఓవర్లకు అమెరికా 48/2 స్కోరు మాత్రమే చేసింది. కానీ జోన్స్‌ గోస్ తన ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చేశారు. మూడో వికెట్‌కు 131 రన్స్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును గెలిపించారు.అయితే ఈ క్రమంలో ఆరోన్ జోన్స్ అరుదైన రికార్డులు నెలకొల్పాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఛేదనలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్ ఓపెనర్‌గా నిలిచాడు.

Also Read: బెర్త్‌ ఖరారు చేసుకున్న భారత బాక్సర్

అలాగే అత్యధిక సిక్సర్లు బాదిన నాన్‌ఓపెనర్‌గానూ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ప్లేయర్ రొసో పేరిట ఉండేది. రోసో ఎనిమిది సిక్సర్లు సాధించాడు.టీ20 వరల్డ్ కప్‌లో ఓవరాల్‌గా ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన రెండో ప్లేయర్‌గా ఆరోన్ జోన్స్ నిలిచాడు. పొట్టి ప్రపంచకప్‌లో క్రిస్ గేల్ ఇంగ్లండ్‌పై 11 సిక్సర్లు, దక్షిణాఫ్రికా‌పై 10 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో గేల్, జోన్స్ తర్వాతి స్థానాల్లో రోసో, యువరాజ్ సింగ్, డేవిడ్ వార్నర్ ఉన్నారు.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?